అడ్డంగా దొరికిపోయిన విష్ణుప్రియ..ఫోన్ పట్టించిందా ..?
బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల యువత పూర్తిగా తప్పు దోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్స్ యాప్స్‌పై ప్రత్యేక దృష్టిని సారించారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిలో భాగంగానే పంజాగుట్టు పోలీసులు యాంకర్ విష్ణు ప్రియకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
విష్ణు ప్రియతో పాటు బిగ్‌బాస్ నటుడు టేస్టీ తేజకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీస్సుల్లో స్పష్టం చేశారు.

కానీ ఆమె పోలీసులకు భయపడి, తనకు బదులుగా RJ శేఖర్ భాషా స్టేషన్‌కు పంపించారు. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విష్ణు ప్రియ స్వయంగా హాజరయ్యారు.తన అడ్వొకేట్‌తో కలసి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు విష్ణు ప్రియ హజరయ్యారు. విచారణలో భాగంగా సందర్భంగా విష్ణుప్రియ సంచలన విషయాలను వెల్లడించింది. తాను మొత్తం 15 బెట్టింగ్స్ యాప్స్‌కు ప్రమోట్ చేసినట్టు ఆమె అంగీకరించింది. దీని కోసం భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు రూ.90 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్‌ను సీజ్ చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications