జీఎస్టీ ఎఫెక్ట్: టెక్కీలకు డిమాండ్, మూడు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది. కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. రోజువారీ వస్తవుల ధరలు పెరగనున్నాయి.జీఎస్టీ అమలుతో సామాన
హైదరాబాద్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది. కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. రోజువారీ వస్తవుల ధరలు పెరగనున్నాయి.జీఎస్టీ అమలుతో సామాన్యులకు ఇబ్బంది తప్పేలా లేదు.చిన్న చిన్న వ్యాపారులకు కూడ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
దేశవ్యాప్తంగా ఓకే విధమైన పన్నును అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయించింది.ఈ విధానాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలు చేయనుంది కేంద్రం.
జిఎస్టీని అమలు చేయడం ద్వారా కొత్తగా ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయి.దీన్ని అమలు చేయడం వల్ల సామాన్యుల కంటే బడా వ్యాపారులకే ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
Recommended Video

అయితే జీఎస్టీ అమలు చేయడం వల్ల ఏ రంగాలవారిపై ఏ మేరకు దాని ప్రభావం ఉంటుందనే విషయం ఆచరణలో తేలనుంది.అయితే శుక్రవారం అర్థరాత్రి వరకు పాత స్టాక్ ను విక్రయించుకొనేందుకుగాను కంపెనీలు, డీలర్లు వినియోగదారులకు బంఫర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
మరోవైపు జీఎస్టీని అమలు చేయడం వల్ల కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం దక్కనుంది. సుమారు లక్షన్నరకు పైగా కొత్తగా ఉద్యోగాలు అవసరమయ్యే అవకాశం ఉంది.

కొత్తగా లక్షన్నరకు పైగా ఉద్యోగాలు
జీఎస్టీ అమలు చేయడం ద్వారా లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కొత్తగా దక్కనున్నాయి.తొలి త్రైమాసికంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగుల అవసరం ఉంటుంది. తర్వాత మరో 50-60 వేల ఉద్యోగాలు కూడ వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్యాక్స్ కన్సల్టింగ్, అకౌంటింగ్ , డేటా అనాలిసిస్, కంపెనీ అకౌంట్స్ , ట్యాక్సేషన్ విభాగాల్లో వీరి అవసరం ఉంటుందని ఆయా విభాగాల్లో 10-13 వార్షిక వృద్దిరేటు కూడ ఉంటుందని అంచనా.

సాఫ్ట్ వేర్ కంపెనీ తయారీకి గిరాకీ
జీఎస్టీకి సంబంధించిన వివిధ సాఫ్ట్ వేర్ల తయారీలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఐటీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం ఏర్పడింది.ముఖ్యంగా ఎస్ఏపీ, ఒరాకిల్ వంటి టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. తర్వలోనే డెలాయిట్ 250 మందిని పరోక్ష పన్ను కన్సల్టెంట్లను, పీ డబ్య్లూసీ 200-250 సీఎ, సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ లనూ నియమించుకోనుంది. కంప్యూటర్ల మీద పట్టుతో పాటు పన్ను చెల్లింపులో అవగాహన ఉన్నవారికి ఉపాధి దొరుకుతోంది.

జీఎస్ పీ లు ఏం చేస్తాయి?
జీఎస్ పీ ..అంటే జీఎస్టీ సువిధ ప్రోవైడర్లు. ఇవి పన్ను రిజిస్ట్రేషన్, చెల్లింపులకు వీలుగా సాఫ్ట్ వేర్ ను రూపొందించి, దాన్ని థర్ట్ పార్ట్ పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విక్రయిస్తాయి. వ్యాపారుల నమోదు, క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ పొందుపర్చడం ప్రతినెలా వార్షిక పన్ను రిటర్న్ దాఖలు చేయడం కూడ వీటి పని.సువిధ ప్రోవైడర్లలో ఒకటైన లాలీ సొల్యూషన్స్, లాటీ ఈఆర్పీ9, రిలీజ్ 6, జీఎస్టీ సాఫ్ట్ వేర్ ను విడుదలచేసింది. జీఎస్టీ కన్నా ముందు 11 లక్షల మంది యూజర్లున్న తమకు జీఎస్టీ సాఫ్ట్ వేర్ తో చందాదారుల సంఖ్య 6 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ ప్రకటించింది.

సాఫ్ట్ వేర్ కు రూ.18 -54 వేలు
జీఎస్టీ సాఫ్ట్ వేర్ ధరలు సేవలను బట్టి మారుతున్నాయి. ఆదాయపన్ను రిటర్న్, టిడిఎస్, ఆడిట్ రిపోర్ట్, జీఎస్టీ వంటివన్నీ ఉంటే ఏడాదికి రూ.19 వేలు ఛార్జీ ఉంటుంది. కేవలం వన్ సోల్యూష్యన్ కైతే ఏడాదికి రూ.8500 చెల్లిస్తే సరిపోతోంది. ఈ సంతకాల వంటి వాటికైతే రూ.54 వేల వరకు ఛార్జీ చేస్తారు. జీఎస్ పీ లే కాకుండా క్లియర్ ట్యాక్స్ , జెనిసిస్ వంటి అప్లికేషన్ సర్వీస్ ప్రోవైడర్లు , జీఎస్టీ వ్యాపారాన్ని అందిపుచుకొంటున్నారు. పన్ను చెల్లింపుదారుల క్రయవిక్రయాల డేటాను సేకరించి జీఎస్టీ రిటర్న్ కు బదలాయించి పన్నులు దాఖలు చేస్తాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications