విమోచన అన్నా, విలీనమన్నా.. నేడు తెలంగాణా చారిత్రాత్మక శుభదినం: పవన్ కళ్యాణ్ ఉద్వేగ ప్రకటన!!

నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైన రోజు సందర్భంగా నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇక మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో వేడుకలను నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .

చైతన్యానికి నెలవు.. విప్లవాలకు కొలువు తెలంగాణ : పవన్ కళ్యాణ్

చైతన్యానికి నెలవు.. విప్లవాలకు కొలువు తెలంగాణ : పవన్ కళ్యాణ్

నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులను గుర్తు చేసుకుంటున్న తరుణమని చెప్పారు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన శుభ దినాన్ని పురస్కరించుకొని ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ చైతన్యానికి నెలవు.. విప్లవాలకు కొలువు తెలంగాణ అంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటిగడ్డ తెలంగాణ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

విమోచన అన్నా విలీనం అన్నా తెలంగాణాకు సంపూర్ణ స్వేచ్చ లభించిన రోజు

విమోచన అన్నా విలీనం అన్నా తెలంగాణాకు సంపూర్ణ స్వేచ్చ లభించిన రోజు

నిత్య చైతన్య దీప్తి తెలంగాణ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అటువంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17 అని గుర్తు చేశారు. అంతేకాదు దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి ఏ పేరుతో పిలిచినా సరే ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభదినం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని దినమని, తెలంగాణ వాసులందరికీ పండుగ దినమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష

అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష

ఈ శుభ తరుణంలో 75వ విమోచన దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అసువులు ధారపోసిన వీరులకు తాను ప్రణామాలు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణ గడ్డలోని అణువణువునా నిక్షిప్తమైన పోరాట తత్వం, అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష అంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా పేర్కొన్నారు.

 హైదరాబాద్ విముక్తి దినోత్సవం .. పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రకటన

హైదరాబాద్ విముక్తి దినోత్సవం .. పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రకటన

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది కళకళలాడాలని, సుఖశాంతులు, సంపదలతో విరాజిల్లాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. నేడు హైదరాబాద్ విముక్తి దినోత్సవం అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తన పోస్ట్ ద్వారా తెలంగాణా ప్రజల పోరాట పటిమను మరోమారు గుర్తు చేశారు. తెలంగాణా ప్రజల్లో తన ప్రకటన ద్వారా స్ఫూర్తి నింపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+