మోడీ అలాంటి నేత కాదంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసలు: బీఆర్ఎస్ సర్కారుపై పరోక్ష విమర్శలు

హైదరాబాద్: నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొని ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. బీజేపీ ముఖ్య నేతలతోపాటు భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోడీ ధైర్యం నింపారని కొనియాడారు. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్ 370, నోట్ల రద్దు చేసేవారు కాదని అన్నారు. రామమందిరం నిర్మించగలిగేవారు కాదని చెప్పారు.

Pawan Kalyan praises pm modi; slams BRS govt in telangana

నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలన్నారు పవన్. తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అని అన్నారు. మోడీ మరోసారి ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోడీ అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి ఉందని బీఆర్ఎస్ సర్కారుపై పరోక్ష విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి

తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలని అన్నారు. బీసీల ఆత్మగౌరవ సభలో కిషన్ మాట్లాడారు. మన్మోహన్ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ అని.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండు అవినీతి పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+