Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజా సేవకులంటూ వీహెచ్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు: బండి సంజయ్‌కి జనసేనాని శుభాకాంక్షలు

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వీ హనుమంతరావు ప్రజల నాయకుడని ఆయన అన్నారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వీ హనుమంతరావు సంపూర్ణంగా కోలుకుని త్వరలోనే ప్రజా సేవకు ఆయన పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇష్టడే రాజకీయ నాయకుల్లో వీ హనుమంతరావు ముఖ్యులు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Pawan Kalyan praises V hanumantha Rao for his public service: birthday wishes said to bandi sanjay

ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోనూ, ప్రజా వాణిని బలంగగా వినిపించడంలోనూ వీహెచ్ శైలి ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ కొనియడారు. వీహెచ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాజకీయ సేవ చేయాలని తన తరపున, జనసేన తరపున ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాన్ తెలిపారు.

బండి సంజయ్‌కి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. '

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంజయ్ ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి. యువ కార్యకర్తగా రాజకీయరంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన సంజయ్ తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి మరిన్ని సేవలు అందిస్తారన్న విశ్వాసం నాకుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను' అంటూ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బండి సంజయ్ ఇందుకు ధన్యవాదాలు తెలిపారు.

బండి సంజయ్‌కి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను' అని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు.

Recommended Video

    L Ramana కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పు పై క్లారిటీ!!

    'గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి నమస్సులు.
    మీరు నా జన్మదినం సందర్భంగా అందించిన శుభాకాంక్షలకు,మీ సహృదయతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను' అని బండి సంజయ్ తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+