హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విధ్వంస రాజకీయాలు చేయను, తెలంగాణ అంటే ఇష్టం, చీల్చను, నా బలం తేలుతుంది: పవన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాయాత్రపై ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇక్కడి ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నాయకులతో భేటీ ఏర్పాటు చేసి, అవగాహన రావాల్సి ఉందన్నారు.

Recommended Video

కాంగ్రెసుకు గుబులు, తెలంగాణలో పవన్ పక్కా ప్లాన్‌ !

రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశం అవుతానని చెప్పారు. తెలంగాణ సమస్యలపై తమ బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సూచనలు చేస్తానని చెప్పారు. సమస్యలపై తెలంగాణలోని అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని తెలిపారు.

నేను రాజకీయ కోణంలో చూడను

నేను రాజకీయ కోణంలో చూడను

ఈ నెల 27వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో కరువు యాత్ర చేపడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పలు సున్నితమైన అంశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదని చెప్పారు. తాను అలా చూడనని చెప్పారు.

వారి సలహాలు తీసుకుంటా, విధ్వంస రాజకీయాలు చేయను

వారి సలహాలు తీసుకుంటా, విధ్వంస రాజకీయాలు చేయను

తమ పార్టీతో కలిసి పని చేయాలనుకునే వారి సలహాలను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను విధ్వంసకర రాజకీయాలు చేయనని చెప్పారు. నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తానని చెప్పారు. ప్రతి సమస్యపై రాజకీయ కోణంలో కాకుండా, పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అభిప్రాయపడ్డారు.

2019 గురించి ఆలోచించట్లేదు, ఆంజనేయుడిని నమ్మితే..

2019 గురించి ఆలోచించట్లేదు, ఆంజనేయుడిని నమ్మితే..


2019లో తాను పోటీ చేయనున్న సీట్లు, ఓట్ల గురించి తాను ఇప్పుడే ఆలోచించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ తెలంగాణలోను తాము పోటీ చేస్తామని చెప్పారు. తన బలం ఎంత, తాను ఎన్ని సీట్లలో పోటీ చేస్తాననే విషయం రెండు నెలల తర్వాత తెలుస్తుందన్నారు. ఆంజనేయ స్వామిని నమ్మితే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయని చెప్పారు.

తెలంగాణ అంటే ప్రేమ, ఇష్టం, చీల్చే రాజకీయం కాదు

తెలంగాణ అంటే ప్రేమ, ఇష్టం, చీల్చే రాజకీయం కాదు

తెలంగాణ అంటే తనకు ప్రేమ, ఇష్టమని చెప్పారు. తెలంగాణపై అవగాహన ఉన్నవాళ్లు జనసేనవైపు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. బీజేపీలోకి రావాలని, తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గతంలో చెప్పారని, కానీ తాను వెళ్లలేదని చెప్పారు.

ఎవరికీ లబ్ధి చేకూర్చే పర్యటనలు చేయను

ఎవరికీ లబ్ధి చేకూర్చే పర్యటనలు చేయను

ప్రజలు తీర్పు ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం గౌరవించాలని చెప్పారు. కానీ తాను రాజకీయంగా ఎవరికీ లబ్ధి చేకూర్చే పనులు, కార్యక్రమాలు చేయనని చెప్పారు. ఏపీలో చంద్రబాబుకు, తెలంగాణలో కేసీఆర్‌కు లబ్ధి పొందేలా పర్యటిస్తున్నారన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణ సమస్యలను సున్నితంగా అధ్యయనం చేయాలన్నారు.

 పవన్ పర్యటనను స్వాగతించిన గంటా

పవన్ పర్యటనను స్వాగతించిన గంటా

అంతకుముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, పవన్ రాజకీయ యాత్రపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. పవన్ ప్రజా యాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో నేత ఒక్కో మార్గం ఎంచుకుంటారని, పవన్ ప్రజా యాత్రను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. పవన్ తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని గంటా అన్నారు. పార్టీ పెట్టినప్పుడు యాత్ర చేయడంలో తప్పు లేదన్నారు.

English summary
Jana sena chief Pawan Kalyan press meet in Karimnagar on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X