తెలంగాణా ఎన్నికల బరిలో జనసేన.. సంసిద్ధం కావాలన్న పవన్ కళ్యాణ్!!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, బీఆర్ఎస్ పై విరుచుకుపడుతూ బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఉందో లేదో తెలియని జనసేన పార్టీ కూడా తెలంగాణా ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే రాష్ట్రంలో గత ఎన్నికలలో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. జనసేన తెలంగాణఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? తెలంగాణా ప్రజలు జనసేనను ఆదరిస్తారా? క్షేత్రస్థాయిలో తెలంగాణాలో జనసేనకు బలమైన నాయకులు లేని క్రమంలో జనసేన తెలంగాణలో పోటీ చేస్తే సక్సెస్ అవుతుందా? అంటే కష్టమే అని చెప్పొచ్చు .

Pawan Kalyan wants Jana Sena to be ready for Telangana elections!!

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఒకపక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ పై బిజెపి, కాంగ్రెస్ ల తో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒత్తిడి పెంచుతున్న వేళ తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేయడం ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది.

అయితే జనసేన పార్టీ తెలంగాణలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందన్న నమ్మకం ఏ ఒక్కరికీ లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్ నిన్న సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు .

పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని నాయకులకు సూచించారు. పవన్ కళ్యాణ్ తో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి , రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ , పార్టీ నాయకులు తాళ్ళూరి రామ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం తదితరులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+