ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం: రాళ్ల దాడి, వాహనం ధ్వంసం
జనగామ జిల్లాలోని జఫర్‌గడ్ మండలంలోని తిడుగు గ్రామంలో గురువారం శాసన సభ్యులు రాజయ్య వాహనంపై గ్రామస్తులు దాడి చేశారు.
వరంగల్: జనగామ జిల్లాలోని జఫర్‌గడ్ మండలంలోని తిడుగు గ్రామంలో గురువారం శాసన సభ్యులు రాజయ్య వాహనంపై గ్రామస్తులు దాడి చేశారు. జఫర్‌గడ్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు జఫర్‌గడ్ మండలాన్ని జనగామ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు.

తమ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ అనేక విధాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిడుగు గ్రామానికి వచ్చిన శాసన సభ్యుడికి చేదు అనుభవం ఎదురైంది.
శాసన సభ్యుడు రాజయ్య గ్రామానికి రాగానే ఆయన వాహనంపై దాడి చేశారు. అంతేకాకుండా పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తిరిగి శాసనసభ్యుడికి రక్షణ కల్పించి అక్కడి నుంచి పంపించారు.












Click it and Unblock the Notifications