సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ కీలక హామీ - ఢిల్లీలో భేటీ..!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. రేవంత్ తో పాటుగా 11 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రస్ అగ్రనాయకత్వం తరలి వచ్చింది. రేవంత్ సీఎంగా తాను ప్రజా పాలన అందిస్తానని ప్రకటించారు. గ్యారంటీల అమలు పైన తొలి సంతకం చేసారు. కాంగ్రెస్ నేతలు మినహా మరెవరూ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ప్రధాని మోదీ రేవంత్ ను అభినందించారు. కీలక హామీ ఇచ్చారు.

ప్రధాని అభినందనలు:తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ ప్రమాణ స్వీకారానికి హజరైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం కోసం పదేళ్లుగా పోరాటం చేస్తోంది. ఈ రోజు ఫలించింది. తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం అనంతరం సామాన్యులకు దగ్గరగా తన పాలన ఉంటుందని స్పష్టం చేసారు.

PM Modi Congratulated Telangana new CM Revanth, assured support for the state

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.

సహకారం పై హామీ:రేవంత్ రెడ్డి ఈ నెల 9న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదే సమయంలో మిగిలిన మంత్రి పదవుల ఖరారు పైన చర్చించనున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలకు చట్ట బద్దత కల్పించనున్నారు. ఆ తరువాత పథకాల అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు.

ముఖ్యమంత్రి హోదా లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరుతున్నట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర అంశాల పైన ప్రధాని మోదీతో చర్చించనున్నారు. వచ్చే వారం రేవంత్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీకి రేవంత్:ఇక, తెలంగాణలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం మొదలైంది. రేవంత్ త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లు తీసుకురావటం సవాల్ గా మారనుంది. రాజకీయంగా ఎలా ఉన్నా కేంద్రం ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంగా సత్సంబంధాలు కొనసాగించాలనేది రేవంత్ అభిమతంగా చెబుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ సాధించే క్రమంలో రేవంత్ కేంద్రంతో తన సంబంధాలు కొనసాగిస్తారని చెబుతున్నారు. దీంతో..ఇక పాలనా పరంగా రేవంత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..కేంద్రంతో ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+