ఓరుగల్లుకు చేరుకున్న ప్రధాని మోడీ; పర్యటన కొనసాగుతుందిలా!!

వరంగల్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ వరంగల్ లోని మామునూరులో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గాన భద్రకాళీ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మావారిని దర్శనం చేసుకోనున్నారు. ప్రధాని మోడీ భద్రకాళీ అమ్మావారిని దర్శించుకోనున్న నేపధ్యంలో భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

30 ఏళ్ళ తర్వాత భారత దేశ ప్రధాని వరంగల్ జిల్లాలో అడుగు పెట్టారు. వరంగల్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ వరంగల్ లోని మామునూరులో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వరంగల్ పోలీస్ కమీషనర్ ఏపీ రంగనాథ్, వరంగల్ , హన్మకొండ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య స్వాగతం పలికారు.

modiinwarangal

అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గాన భద్రకాళీ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మావారిని దర్శనం చేసుకోనున్నారు. ప్రధాని మోడీ భద్రకాళీ అమ్మావారిని దర్శించుకోనున్న నేపధ్యంలో భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36 నిమిషాలకు శ్రీ భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు.

ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు . ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోడీ చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

వరంగల్ కు చేరుకున్న ప్రధాని మోడీకి దారి పొడవునా ధ్వానాలతో ప్రజలు స్వాగతం పలికారు. పీఎం మోడీ వారందిరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం కోసం మోడీ వస్తున్నారని పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు వరంగల్ లో సందడి చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం అంతా నమో మోడీ అన్నట్టు ప్రస్తుతం పరిస్థితి ఉంది.

ఇక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో మోడీ ప్రసంగం వినటం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణా అభివృద్ధి కోసం మోడీ సర్కార్ ఏం చేశారో సభా వేదికపై వివరిస్తున్నారు. ప్రధాని తొమ్మిదేళ్ళ పాలనలో తెలంగాణా రాష్ట్రానికి ఏం చేశారో సవివరంగా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+