వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పర్యటన: అన్నీ తానై.. హరీష్ భుజాలపై కేసీఆర్ బాధ్యతలు

|
Google Oneindia TeluguNews

గజ్వేల్: మెదక్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభింప చేసిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం అనుకున్నట్లుగానే బాగా నిర్వహించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని మోడీ తొలిసారి వచ్చారు. ఈ నేపథ్యంలో దీనిని బాగా నిర్వహించాలని కేసీఆర్ భావించారు.

మిషన్‌ భగీరథను అదే స్థాయిలో ప్రారంభించాలని సంకల్పించిన ప్రభుత్వం, అనుకున్నట్టుగానే నిర్వహించింది. ప్రధాని మోడీకి మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. ప్రతి విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించడం, ఎక్కడా, ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్త పడడంతో ప్రధాని పర్యటన ఆదివారం మెదక్‌ జిల్లాలో సజావుగా ముగిసింది.

మొత్తం ఈ ప్రక్రియలో ఎప్పటిలాగే, టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన మంత్రి హరీశ్‌ రావు కీలకపాత్ర పోషించారు. తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీకి భారీ జనసమీకరణతో ఘన స్వాగతం పలకాలని సంకల్పించారు. ఆ బాధ్యతలను మంత్రి హరీశ్ పైన వేశారు.

 హరీష్ రావు

హరీష్ రావు

మెదక్ జిల్లా మంత్రిగా, ప్రధాని సభ ఇంఛార్జిగా వారం రోజులుగా హరీష్ రావు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నియోజకవర్గాల వారీగా పర్యటించి మండలాలు, గ్రామాల వారీగా ఇంఛార్జులను నియమించారు. వారిని డీఆర్‌డీఏ పీడీతో సమన్వయం చేసి ఐకేపీ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ శ్రేణులను తరలించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇంఛార్జులుగా చేసి వారికి టార్గెట్‌ విధించారు.

హరీష్ రావు

హరీష్ రావు

గజ్వెల్ నియోజకవర్గంలో ఆరు మండలాలకు ఆరుగురు ఇంఛార్జులను నియమించి జనసమీకరణకు ఆదేశించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ తొలిఫలం అందుతున్న ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ జనసమీకరణ జరిగేలా చూశారు. అందుకు పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన ప్రజలకు బస్సులలోనే ఆహారం అందించారు.

 హరీష్ రావు

హరీష్ రావు

మొత్తం గజ్వేల్‌లోనే మకాం వేసిన హరీశ్‌ ఎప్పటికప్పుడు కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌, జేసీ వెంకట్రాం రెడ్డి తదితర అధికారులతో సమీక్ష జరిపారు.

హరీష్ రావు

హరీష్ రావు

దీంతో ప్రధాని మోడీ పర్యటన సజావుగా ముగిసింది. ప్రతి ఒక్కటీ పక్కా ప్రణాళికతో అమలు చేయడంతో లక్ష్యం మేరకు రెండు లక్షల మందిని తరలించి, సభను సక్సెస్‌ చేసిన హరీశ్‌ మరోసారి సత్తా చాటారు.

English summary
PM Modi visit: Minister Harish Rao make arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X