హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆంక్షలు, దారి మళ్లింపు..!!

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై ఆంక్షలు అమలు అవుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ఈ రోజు (16వ తేదీ ) నుంచి 19వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో, 65వ జాతీయ రహదారి పైన వాహనాల దారి మళ్లింపు మార్గాల ను అధికారులను వెల్లడించారు. ఈ మార్పులకు సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు.

19వ తేదీ వరకు ఆంక్షలు
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన ప్రయాణాల్లో ఈ నెల 19వ తేదీ వరకు ఆంక్ష లు కొనసాగనున్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో ఈ మళ్లింపు చోటు చేసుకోనుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. కోదాడ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు.

Police alert for Vijayawada - Hyderabad national high way 65 travellers route diversions

దారి మళ్లింపు
అదే విధంగా హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద నేషనల్ హైవే 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేటకు వచ్చే బస్సులు, ప్రజా రవాణా వాహనాలు ఎస్సారెస్పీ కెనాల్‌ మీదుగా బీబీగూడెం నుంచి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్లే వాహనాలను కుడకుడ, ఐలాపురం, ఖమ్మం జాతీయ రహదారిపై నుంచి రాఘవాపురం స్టేజీ, నామవరం మీదుగా గుంజలూరు స్టేజీ వరకు మొత్తంగా మళ్లించి కోదాడ వైపు పంపనున్నారు.

కీలక సూచనలు
ఈ మార్పులతో పాటుగా మరి కొన్ని సూచనలు చేసారు. సూర్యాపేట మీదుగా వచ్చే భక్తుల కోసం హెచ్‌పీ పెట్రోల్‌ బంకు నుంచి రాంకోటితండాకు వెళ్లే మార్గంలో వాహనాల కోసం పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారు. గరిడేపల్లి, పెన్‌పహాడ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను పాత కలెక్టర్​ ఆఫీస్​ వెనుక ఏర్పాటు చేసిన స్థలంలో నిలపాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కోదాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఖాసీంపేట గ్రామం మార్గంలో ఉంచాల్సి ఉంటుంది. మోతె, చివ్వెంల మీదుగా జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను చివ్వెంల మీదుగా మళ్లించి మున్యానాయక్‌తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్‌ స్థలం కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+