ఎట్టకేలకు లేడీ డాన్ అంగూర్‌బాయి అరెస్ట్

Hyderabad: పలు కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ధూల్‌పేట గంజాయి డాన్అంగూర్ బాయిని పోలీసులు ఎట్టకేలకు గురువారం అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాలతో రూ. కోట్లు కూడబెట్టిన అంబూర్ బాయిపై హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం.

ధూల్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు, అసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో అరెస్టు చేయడానికి పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పించుకుంది. దీంతో ఆమె సంచారంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

Police arrest ganja don Angur Bai in Hyderabad

కాగా, అంగూర్ బాయి కుటుంబసభ్యుల్లో 15 మందిపై పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. గంజాయి హోల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో ఆరితేరిన అంగూర్ బాయిని ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా ఈరోజు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో కార్వాన్ ప్రాంతంలో అంగూర్‌బాయిని ఎస్‌‌టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ నిందితురాలిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.

హైదరాబాద్‌లో భారీ దోపిడీ

హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పరిధి అరవింద్ కాలనీలో భారీ దోపిడీ జరిగింది. బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి రెండున్నర కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో వ్యాపారి రంజిత్, అతని సోదరుడి ఇళ్లలోకి చొరబడిన 10 మంది దుండుగులు కత్తులు, తుపాకులతో బెదిరించారు. లాకర్‌లోని 2.5 కిలోల బంగారం, మూడు ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ అపహరించారు. దోపిడీ చేసిన దుండగులు చేసిన దాడిలో ఆ వ్యాపారికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+