వరంగల్లో నేటి నా ఫేవరేట్ పిక్చర్: కేటీఆర్‌కు పోలీస్ డాగ్ షేక్ హ్యాండ్

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. వరంగల్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆయనకు ఓ పోలీస్ డాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశారు. ఈ రోజు తన వరంగల్ పర్యటనలోని ఫేవరేట్ పిక్చర్ అని పేర్కొన్నారు. ఓ పోలీస్ డాగ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిందని పేర్కొన్నారు.

కాగా, కేటీఆర్ మానుకోట జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ మాట్లాడారు.

police canine offered a warm handshake with KTR

ఇది మామూలు గడ్డ కాదన్నారు. కాంగ్రెస్ నేత చిరంజీవి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిన గడ్డ అన్నారు. తెలంగాణ బిడ్డగా తాను ఈ గడ్డను ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. మానుకోట వేదికగా సమైక్యవాదులను తరిమికొట్టిన ఘనత ఇక్కడి గిరిజన బిడ్డలకు దక్కుతుందన్నారు.

ఎన్నో నమ్మకాలు, అపనమ్మకాలు, హేళనల మధ్య తెలంగాణ ప్రజల అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+