Shocking video: ఆ అంబులెన్స్ ను వెంటాడిన పోలీసులు!
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది. సినీ ఫక్కీలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒక అంబులెన్స్ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వేగంగా అంబులెన్స్... అంబులెన్స్ ని వెంటాడుతూ తెలంగాణ పోలీసులు అచ్చం సినిమాలోని చేజింగ్ సీన్ లాగా పోలీసులు ఎట్టకేలకు 108 అంబులెన్స్ ను చేజ్ చేశారు.
హైవేపై అంబులెన్స్
అసలు ఎందుకు అంబులెన్స్ రోడ్డు పైన హల్చల్ ఎందుకు చేసింది? తెలంగాణ పోలీసులు హైవే పైన అంబులెన్స్ ను ఎందుకు ఛేజ్ చేశారు అనే వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి 108 అంబులెన్స్ ను చోరీ చేసి విజయవాడ వైపు తీసుకు వెళుతున్న క్రమంలో దొంగను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు వెంటాడినా చిక్కని అంబులెన్స్
హైదరాబాదులోని హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి ఖమ్మం మీదుగా విజయవాడకు వెళుతున్న దొంగను పట్టుకోవడానికి వెంబడించిన పోలీసులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి మొదలుపెడితే నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు ఆ అంబులెన్స్ ను ఆపడానికి నానా చావు చచ్చారు. ఎక్కడికి అక్కడ ఆ రూట్ లో ఉన్న పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ అంబులెన్స్ దొంగ ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.
ఎస్సై జాన్ రెడ్డిని ఢీకొట్టి, టోల్ గేట్ విరగ్గొట్టి
చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై జాన్ రెడ్డిని ఢీకొట్టి మరీ ఆ దొంగ వాహనంతో రయ్యన దూసుకుపోయాడు. ఆ తర్వాత కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద టోల్గేట్ ను ఢీ కొట్టి మరీ అంబులెన్స్ దొంగ పారిపోయాడు. ఇక ఎట్టకేలకు పోలీసులు రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి టేకుమట్ల స్టేజి వద్ద అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్#Ambulance #Hyderabad #Vijayawada #Oneindiatelugu pic.twitter.com/wws6xqbwMn
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2024
అంబులెన్స్ ఛేజింగ్ వెనుక కారణమిదే
కేతేపల్లి ఎస్సై శివతేజ అంబులెన్స్ దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో 108 సిబ్బంది, ఇటు పోలీసులు ఊపిరి తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు విషయం ఏమిటి అంటే 108 అంబులెన్స్ చోరీ చేసి విజయవాడ వైపు తీసుకు వెళుతున్న వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి.. ఇతను గతంలో కూడా ఇదే విధంగా అంబులెన్స్ ను చోరీ చేసి తీసుకువెళ్లాడు. మొత్తానికి సినిమా స్టైల్ లో జరిగిన ఈ ఛేజింగ్ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications