Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మన కన్నా ఈ కుక్క జీవితం రాయల్ గా ఉంది!

సాధారణంగా ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు వారు చేసిన సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటాం. అందరూ కలిసి సత్కారాలను కూడా చేస్తూ ఉంటాం. ఇలా చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే మనుషులకే కాదు కుక్కలకు కూడా సన్మానాలు జరుగుతుంటాయి. ఈ విషయం మీకు తెలుసా..

పోలీసు జాగిలానికి కూడా ఘనంగా పదవీ విరమణ
పోలీస్ శాఖలో పనిచేసే పోలీసులకు మాత్రమే కాదు, పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసే రిటైర్ అయిన పోలీసు జాగిలాలకు కూడా ఘనంగా పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలీస్ శాఖలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ జాగిలం నేర నియంత్రణలో కీలక భూమిక పోషిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తన సేవలను అందిస్తుంది. అటువంటి జాగిలం పదవీ విరమణ చేస్తే దానికి అందించే గౌరవమే వేరు.

police dog grand retirement function warangal cp falicitated police dog brono

బ్రోనోకు శాలువా కప్పి పూలదండ వేసి సన్మానం
తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 12 వసంతాలు సేవలందించిన పోలీస్ జాగిలం బ్రోనోకు పోలీస్ అధికారులు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ఘ కాలంగా సేవలందించిన బ్రోనో ను ఘనంగా సత్కరించారు. బ్రోనోకు శాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సన్మానం చేశారు.

police dog grand retirement function warangal cp falicitated police dog brono

15 కేసుల నిందితులను గుర్తించటంలో కీలకంగా పోలీస్ జాగిలం
ట్రాకర్ జాగిలంగా గుర్తించబడిన బ్రోనో పోలీస్ శాఖలో చేరిన నాటి నుండి 15 కేసుల నిందితులను గుర్తించడంతో పాటు జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లలో బ్రోనో పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం దీని శిక్షకుడిగా హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ వ్యవహరించారు.సుదీర్ఘకాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సేవలందించిన బ్రోనోను ఉద్దేశించి మాట్లాడిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ శాఖలో జాగిల విభాగం చాలా కీలకమైందిగా పేర్కొన్నారు.

కేసులను ఛేదించడంలో పోలీసు జాగిలాల పాత్ర
నేరస్తులను పట్టుకోవడంతో పాటు, పేలుడు పదార్థాలను, మత్తుపదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు కీలక భూమిక పోషిస్తున్నాయని ఆయన అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో అనేక కేసులను ఛేదించడంలో పోలీసు జాగిలాల పాత్ర ఎంతో ఉందని, ప్రస్తుతం పదవి విరమణ పొందిన బ్రోనో పోలీసు శాఖలో ఎన్నో గుర్తించదగిన సేవలను అందించిందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+