Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున అంబర్‌పేట-గోల్నాక మధ్య వెళ్లే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ కె శ్రీనివాస రెడ్డి
ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1448 సెక్షన్ 21 క్లాజ్ (1), (బి) కింద ప్రజలకు పలు సూచనాలు చేశారు. సాఫీగా ట్రాఫిక్‌ను కొనసాగించడానికి, ప్రజలకు ప్రమాదం, అసౌకర్యాన్ని నివారించడానికి, జులై 24 బుధవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
పని పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. 6 నంబర్ జంక్షన్ నుంచి గోల్నాకకు వెళ్లే వాహనాలు జిందా తిలిస్మత్‌కు దారిలోక మళ్లించనున్నారు. గోల్నాక నుంచి 6వ నంబర్ జంక్షన్ వరకు ఆంక్షలు లేకుండా ట్రాఫిక్ యధావిధిగా కొనసాగనుంది. ఎన్‌సిసి గేట్ నుంచి 6 నంబర్ జంక్షన్‌కు వచ్చే ఆర్‌టిసి బస్సులను తిలక్ నగర్ ఎక్స్ రోడ్‌లో ఫీవర్ ఆసుపత్రి వైపు మళ్లిస్తారు.

అంబర్‌పేట్ ఫ్లైఓవర్ చుట్టూ ఉన్న మళ్లింపులను సాధారణ ప్రజలు గమనించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ పోలీసులు కోరారు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గత నెలలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. దీంతో గుత్తేదారులు ప్లై ఓవర్ నిర్మాణ వేగం పెంచారు.
జీహెచ్ఎంసీ కూడా చాలా చోట్ల ప్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ గుత్తేదారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications