దీక్ష తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టండి, సిబ్బందికి పోలీసు శాఖ ఆదేశాలు..!!
హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు చర్చకు కారణమయ్యాయి. పోలీసు శాఖ మతపర మైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొంది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పని సరిగా సెలవు తీసుకుని మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. ఇప్పుడు ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మతపరమైన దీక్షల పై పోలీసు శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించి నందుకు సౌత్ ఈస్ట్ జోన్ కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌కు పోలీసు శాఖ మెమో జారీ చేసింది. అంతేకాకుండా పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే షూస్ లేకుండా సివిల్ డ్రెస్సులో (బ్లాక్ డ్రెస్) డ్యూటీ చేయవద్దని హెడ్ ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో చాలా మంది అయ్యప్పమాల దీక్ష ధరిస్తున్నారు.

కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు మాలలు ధరిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌శాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులు కచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. ఒకవేళ దీక్షలో ఉంటే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటే రెండు నెలల పాటు సెలవులు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కాగా, దీక్ష ధరించి విధులకు రావొద్దని.. నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించి యూనిఫామ్ లేకుండా విధులకు హాజరుకావొద్దని పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ ఆంక్షలపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం కూడా పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు ఇస్తోందన్నారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ వేళ ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరు అంటూ రాజాసింగ్ విరుచుకుపడ్డారు. అయితే, పోలీసు శాఖ లో ఈ ఆదేశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డ్యూటీలో ఉన్న ఏ పోలీసు అయినా మతపరమైన ఆచారాలను ప్రదర్శించటం సరి కాదని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీంతో, ఇప్పుడు ఈ ఆదేశాలు కొత్త చర్చకు కారణమయ్యాయి.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?











Click it and Unblock the Notifications