‘బుల్లెట్లా ఎలా ఉంటాయ్, తుపాకీ చూడనే లేదు’: విచారణలో విక్రమ్ తిక్క సమాధానాలు
హైదరాబాద్: అనేక మలుపులు తిరిగిన మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కేసు విచారణలో షాకింగ్ సమాధానాలు పోలీసులకు ఎదురవుతున్నాయి. అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు తన తండ్రి, మామలను బెదిరించేందుకు విక్రమ్ గౌడ్ తనపై తానే సుపారీ ఇచ్చి కాల్పులు జరిపించుకున్న విషయం తెలిసిందే.

తిక్క సమాధానాలు..
కాగా, విక్రమ్ గౌడ్‌ను ఒక రోజుపాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్నుంచి ఎలాంటి ప్రశ్నలకూ సమాధానం రాబట్టలేకపోయినట్లు సమాచారం. తుపాకీ ఎక్కడ కొన్నారు?, కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మూడింటిని వాడగా.. మిగతావి ఎక్కడ? వంటి ప్రశ్నలకు విక్రమ్ గౌడ్ తిక్క సమాధానాలు చెప్పినట్లు పోలీసుల వర్గాల ద్వారా తెలిసింది.
Recommended Video


పోలీసుల సహనాన్ని పరీక్షించిన విక్రమ్..
‘బుల్లెట్లా అవి ఎలా ఉంటాయి?.. తుపాకీని నేను జీవితంలో చూడలేదు!' అంటూ పోలీసుల సహనాన్ని విక్రమ్ గౌడ్ పరీక్షించినట్లు సమాచారం. దీంతో విక్రమ్ గౌడ్ ను మరోసారి కస్టడీకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మిగతా బుల్లెట్లను ఎక్కడ దాచారన్న విషయాన్ని తేల్చేందుకు మరోసారి ఆయన ఇంటికి సోదాలకు వెళ్లి పోలీసులు ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు.

సూటిగా సమాధానం చెప్పలేదు..
పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ విక్రమ్ గౌడ్ సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఆయన్నుంచి ఎంతో సమాచారం సేకరిస్తామనుకున్న పోలీసులకు నిరాశ ఎదురైంది. విక్రమను బుధవారం ఉదయం 10గంటలకు జైలు నుంచి తీసుకుని వచ్చిన పోలీసులు సాయంత్రం 4గంటల్లోపే తిరిగి జైలుకు పంపించారు.

కాలయాపనే..
ఈ సమయంలో విచారణకు విక్రమ్ గౌడ్ సహకరించకపోవడంతో పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విక్రమ్ గౌడ్ కాలయాపన చేశాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. దీంతో విక్రమ్ గౌడ్‌ను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications