Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నామస్మరణే తప్ప ఏముంది? కష్టకాలంలో ఇలాంటి పనులా?: వైరాలో పొంగులేటి శ్రీనివాస్

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేవలం గొప్పలు చెప్పుకోవడం, నామస్మరణ కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల బాగోగులను గురించి పాలకులు ఆలోచించడం లేదన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడారు.

రైతులు కష్టకాలంటో ఉంటే.. కొత్త సచివాలయం కావాలా?: పొంగులేటి

రైతులు కష్టకాలంటో ఉంటే.. కొత్త సచివాలయం కావాలా?: పొంగులేటి

కరోనావైరస్ కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. మరి వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. గొప్పలకు పోయే బదులు.. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ డబ్బు ఎందుకు రుణమాఫీకి ఖర్చు చేయడం లేదని నిలదీశారు.

నామ స్మరణ తప్ప తెలంగాణ బిడ్డల కోసం చేసిందేంటి?: పొంగులేటి

నామ స్మరణ తప్ప తెలంగాణ బిడ్డల కోసం చేసిందేంటి?: పొంగులేటి

పేరు బ్రాండ్, నామస్మరణ కోసం తప్ప తెలంగాణ బిడ్డల బాగోగుల గురించి పాలకులు ఆలోచించడం లేదని కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ బిడ్డలు కన్న కలలను ఏ మేర నెరవేర్చామన్నది, అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా.. ఏడాదిన్నర కాలంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. 16 నెలలు దాటినా ధరణిలో పరిష్కారానికి నోచుకోని అంశాలు పదికిపైనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయం పాలకులకు తెలిసినా.. తెలియనట్లే చేస్తున్నారని మండిపడ్డారు.

ఉచిత కరెంట్ ఏది?: రోడ్లపైనే రైతులంటూ పొంగులేటి ఫైర్

ఉచిత కరెంట్ ఏది?: రోడ్లపైనే రైతులంటూ పొంగులేటి ఫైర్

24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసివుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ తొత్తులకే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కట్టబెడుతున్నారని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోకక తప్పదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే 15 ఏళ్లకైనా గోదావరి నీళ్లతో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామా? అని ప్రశ్నించారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు పొంగులేటి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+