కేసీఆర్ ‘ప్రత్యూష’ మారిపోయింది: నర్సింగ్ కోర్సు చేస్తూ ఇలా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో బయటపడ్డ ప్రత్యూష ఇప్పుడు నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ఆమె నర్సింగ్‌ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు మంగళవారం సీఎంకు వివరించగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు.

చిత్రహింసల కేసు: పోలీసులకు చిక్కిన ప్రత్యూష తండ్రి

ప్రత్యూష-మద్దిలేటి పెళ్లితో బాబు, కెసిఆర్ వియ్యంకులవుతారట: ఎలాగంటే..!

సవతి తల్లి చేతిలో చిత్రహింసలు

సవతి తల్లి చేతిలో చిత్రహింసలు

2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన ప్రత్యూషకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమెను పరామర్శించి తన దత్తపుత్రికగా ప్రకటించారు కేసీఆర్.

అన్నీ తానైన కేసీఆర్..

అన్నీ తానైన కేసీఆర్..

ఇంటికి పిలిపించి భోజనం పెట్టడంతోపాటు ఆమెకు కోరుకున్న సాయం అందిస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివించి, ఆమెకు తానే పెళ్లి కూడా చేస్తానని ప్రకటించారు.

నర్సింగ్ కోర్సు చేస్తూ ఇలా..

నర్సింగ్ కోర్సు చేస్తూ ఇలా..

సీఎం హామీ మేరకు ప్రభుత్వం తరఫున ఆమెకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు కోరుకున్న విధంగా చదివిస్తున్నారు. కాగా, ఇప్పుడు నర్సింగ్ చేస్తున్న ప్రత్యూషకు అనాటి ప్రత్యూష చాలా మారిపోయింది. నర్సింగ్ డ్రెస్సులో కొత్తగా కనిపిస్తోందీ ప్రత్యూష.

అప్పట్లో ప్రేమలో ఉన్నానంటూ..

అప్పట్లో ప్రేమలో ఉన్నానంటూ..

ప్రత్యూషను దత్త పుత్రికగా స్వీకరించిన కేసీఆర్ ఆమె చదువు, పెళ్లికి సంబంధించిన బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, అప్పట్లో ప్రత్యూష్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతడ్నే వివాహం చేసుకుంటానని కూడా గతంలో ప్రత్యూష ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, పెళ్లి తర్వాత తన చదువును కొనసాగిస్తానని స్పష్టం చేసింది. అయితే, ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత ఆమె పెళ్లి విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Telangana CM K Chandrasekhar Rao' adopted daughter prathyusha doing nursing course.
Please Wait while comments are loading...