Pratyusha Case: హీరోయిన్ ప్రత్యూష కేసులో సుప్రీం కీలక ఆదేశాలు..!

టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యూష (pratyusha) రేప్ అండ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ సంచలన ఆదేశాలు ఇచ్చింది. సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్దార్ధ్ రెడ్డికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. సిద్ధార్ధ్ రెడ్డిపై హైకోర్టు శిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ప్రత్యూష తల్లి ఈ తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Pratyusha Rape-Murder Case SC Rejects Appeal Siddharth Reddy Ordered to Surrender Within a Month

ప్రత్యూష, సిద్దార్ఢ్ రెడ్డి ఇద్దరూ ఇంటర్ కాలేజీలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిపోగా.. సిద్ధార్ధ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. 2002లో హఠాత్తుగా ఒక రోజు వీరిద్దరూ కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగిన పరిస్ధితుల్లో ఆస్పత్రిలో చేరారు. అక్కడ ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్ధ్ బతికిపోయాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆమెపై సిద్ధార్ధ్ ఎలాంటి లైంగిక దాడీ చేయలేదని, చంపలేదని తేలింది. అయితే ఆత్మహత్యకు పురికొల్పిన కేసులో అతన్ని సీబీఐ కేసులు నమోదు చేసింది. చివరకు ఈ అభియోగాల ఆధారంగా హైదరాబ్ద్ లోని స్ధానిక కోర్టు సిద్ధార్ధ్ రెడ్డిని దోషిగా నిర్దారించింది.

సిద్దార్ధ్ రెడ్డికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 5 వేల జరిమానా కూడా విధించారు. దీనిపై అతను 2011లో హైకోర్టును ఆశ్రయించగా.. శిక్షను రెండేళ్లకు తగ్గించారు. జరిమానాను 50 వేలకు పెంచారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. అతను నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ప్రత్యూష తల్లి స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+