ప్రీతి పొత్తికడుపుకి ఆపరేషన్; సంచలన విషయాలు బయటపెట్టిన ప్రీతి సోదరుడు పృధ్వీ
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై ఆమె సోదరుడు పృధ్వి కాకతీయ మెడికల్ కాలేజీ అధికారులపైనా, నిమ్స్‌లో వైద్యంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది.
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు రాష్ట్రంలో సంచలనాలకు కేరాఫ్ గా మారింది. ఇప్పటికే ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య అని తల్లిదండ్రులు పదే పదే చెబుతూ ఉంటే, తాజాగా ప్రీతి సోదరుడు పృధ్వీ ప్రీతి మృతి గురించి పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా వీడియో విడుదల చేసిన ప్రీతి సోదరుడు పృధ్వీ కాకతీయ మెడికల్ కళాశాల అధికారులపై, అలాగే నిమ్స్ లో జరిగిన వైద్య చికిత్సలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కలకలంగా మారింది.

కౌన్సిలింగ్ పై అధికారులు చెప్పింది అబద్ధం
తమ సోదరి ఆత్మహత్య కాదు అని చెప్పడానికి కావలసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక తాజాగా తన సోదరి ప్రీతికి, సైఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని అధికారులు చెప్పిందంతా పూర్తి అబద్ధమని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు పృధ్వీ. హెచ్ ఓ డి తన సోదరి ప్రీతిని పిలిచి, ఎటువంటి వివరణ అడగకుండా బాగా తిట్టాడని పేర్కొన్నారు. సైఫ్ కు పూర్తి మద్దతుగా ఉన్న నాగార్జున రెడ్డి తో కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని అతను ప్రశ్నించారు.

నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద ఆపరేషన్ .. ఎందుకు చేశారు?
సైఫ్ కు ఫేవర్ గా కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు. ప్రీతికి చేతి పై గాయం ఉందని, ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని పేర్కొన్న అతను పోస్టుమార్టం లో ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు. నిమ్స్ లో జరిగిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

చికిత్స పూర్తి వివరాలివ్వండి.. నాగార్జున రెడ్డిపై ఆరోపణలు
నిమ్స్ వైద్యులు తమ సోదరికి చేసిన పూర్తి వైద్య చికిత్స వివరాలను తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కమిటీ పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, నాగార్జున రెడ్డి తప్పు చేసిన వ్యక్తి అయితే, అతడిని ఎలా ర్యాగింగ్ కమిటీలో ఉంచుతారని ప్రశ్నించారు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్టును మార్చి ఉంటారని ప్రీతి సోదరుడు పృధ్వి సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి సెల్ ఫోన్ లో మెసేజ్ లను తను చెక్ చేసానని పేర్కొన్న పృధ్వీ తమకు కనిపించని మెసేజ్ లు పోలీసులకు ఎలా కనిపించాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications