ఓకే చెప్పిన సోనియా గాంధీ- పార్లమెంట్‌లో రేవంత్‌కు అభినందనల వెల్లువ
Sonia Gandhi: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రొనాల్డ్ రాస్.. ఇతర అధికారులు ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్తోన్న విషయాన్ని సోనియా గాంధీ నిర్ధారించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె అవునంటూ బదులిచ్చారు.
#WATCH | Delhi | Telangana CM-designate Revanth Reddy arrives at the Parliament.
— ANI (@ANI) December 6, 2023
The Congress MP from Malkajgiri is expected to tender his resignation as a Member of the Parliament, ahead of his swearing-in ceremony in Hyderabad tomorrow. pic.twitter.com/5Kllvj5fHx
అంతకుముందు- సోనియా గాంధీ నివాసంలో రేవంత్ రెడ్డి ఆమెను కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో భేటీ అయ్యారు. వారందరూ హైదరాబాద్‌కు రావడం దాదాపుగా ఖాయమైంది.

కాగా పార్లమెంట్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డిని హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా అభినందించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ప్రశంసించారు. హర్యానా మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోందని అన్నారు. రేవంత్ సారథ్యంలో నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications