చావుకు భయపడితే మార్చలేం, దేశ చరిత్రకు మూలం అవే: ఐలయ్య

గత కొద్దిరోజులుగా తనను తాను హౌజ్ అరెస్ట్ చేసుకున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య గురువారం నాడు నిర్బంధాన్ని వీడారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తనను తాను హౌజ్ అరెస్ట్ చేసుకున్న ప్రొఫెసర్ కంచ
ఐలయ్య గురువారం నాడు నిర్బంధాన్ని వీడారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంతో పాటు ఐలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని 200సంవత్సరాల 'ఇండియన్ ఇంగ్లీష్ డే' వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐలయ్య హాజరు కాగా బహుళ బహుజన సమితి అధ్యక్షులు ఉసా, ప్రొఫెసర్లు మోహన్ ధరావత్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒగ్గు డోలు స్వాగతం:

ఒగ్గు డోలు స్వాగతం:

గృహ నిర్బంధాన్ని వీడి బయటకొచ్చిన ఐలయ్యకు ఉస్మానియా విద్యార్థులు ఒగ్గు డోలుతో ఘన స్వాగతం పలికారు. ఐలయ్య సైతం స్వయంగా ఒగ్గు డోలు వాయించి విద్యార్థుల్లో జోష్ నింపారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐలయ్య పుట్టిన రోజు వేడుకలతో పాటు ఇంగ్లీష్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ చేసిన కేకును మహాత్మా జ్యోతిరావు పూలె, సావిత్రి పూలె, దేశ గతిని మార్చిన అంబేడ్కర్ లకు ఆయన అంకింతం ఇచ్చారు.

చావుకు భయపడేవారు దేశాన్ని మార్చలేరు:

చావుకు భయపడేవారు దేశాన్ని మార్చలేరు:

చావుకు భయపడేవారు దేశాన్ని మార్చలేరని, కత్తి పట్టుకున్నవాడి కన్నా కలం పట్టుకున్నవాడే వ్యవస్థను మార్చగలడని ప్రొఫెసర్ ఐలయ్య మరోసారి స్పష్టం చేశారు. మెరిట్ సాకుతో దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఇంకా అణచివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వాళ్లంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ తమ పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ విద్యను దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతంలో ఆంగ్ల విద్యకోసం, దేశంలో అట్టడుగు వర్గాల వాటా కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చైతన్య, నారాయణలను ప్రారదోలండి:

చైతన్య, నారాయణలను ప్రారదోలండి:

వచ్చే 2019కల్లా తెలంగాణ నుంచి చైతన్య, నారాయణ విద్యా సంస్థలను ప్రారదోలాలని ఐలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్ చెబుతున్న కేజీ టూ పీజీ విద్యా విధానాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంటర్మీడియట్ విధానాన్ని ఎత్తేసి.. 8-12తరగతుల వరకు హైస్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ప్రతీ గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. 12వ తరగతి లోపే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించగలిగితే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతారని చెప్పారు.

ఈ దేశ చరిత్రకు మూలం :

ఈ దేశ చరిత్రకు మూలం :

ఏ కార్పోరేట్ కంపెనీకి వెళ్లినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను మెరిట్ లేదన్న సాకు చెప్పి వెనక్కి పంపిస్తున్నారని ఐలయ్య మండిపడ్డారు. వాళ్ల తల్లిదండ్రులు శ్రమ చేయకపోతే ఈరోజు మీ కంపెనీలు పుట్టుకొచ్చేవా? అని ప్రశ్నించారు. ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతామని చెప్పారు.

ఈ దేశ చరిత్రకు మూలం కుండ, చెప్పు, మంగలి కత్తి అని మర్చిపోకూడదని గుర్తుచేశారు. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లంతా బ్రాహ్మణ, వైశ్య కులాల వాళ్లే ఉన్నారని, దళిత బహుజనులు ఇంగ్లీష్ విద్య నేర్చుకుంటే 20ఏళ్లలో అగ్రకుల మేదావులే కనిపించబోరని అన్నారు.

 ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా:

ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా:

దేశంలో రెండు కులాలు- బ్రాహ్మణులు, వైశ్యులు మాత్రమే మేధావులుగా వ్యవహరిస్తున్నారని, కాని అంతకు రెట్టించిన మేధావులు ఎస్సీ,ఎస్టీ, బీసీల్లో ఉన్నారని ఐలయ్య అన్నారు. దేశ భద్రతలో ముందుండే సైనికుల పిల్లలకు, కానిస్టేబుళ్ల పిల్లలకు అగ్రకుల పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని ప్రొఫెసర్ ఐలయ్య డిమాండ్ చేశారు.

చాలామంది తనను క్రిస్టియన్ ఏజెంటు అని మాట్లాడుతున్నారని, ఒకప్పుడు అంబేడ్కర్ ను కూడా అలాగే అన్నారని గుర్తుచేశారు. బ్రాహ్మణులంతా ఆ క్రిస్టియన్ కాలేజీల్లో చదువుకునే ఇంగ్లీష్ నేర్చుకున్నారని అన్నారు. తాను బ్రిటన్, అమెరికా ఇంగ్లీష్ గురించి మాట్లాడటం లేదని 200ఏళ్ల దళిత బహుజనుల ఇండియన్ ఇంగ్లీష్‌ గురించి మాట్లాడుతున్నానని గుర్తుచేశారు.

 మా పోచమ్మకు అన్ని భాషలు వచ్చు:

మా పోచమ్మకు అన్ని భాషలు వచ్చు:

శూద్ర దేవతలైన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు అర్థమవుతాయని, ఏ భాషలో వారిని వేడుకున్నా కరుణిస్తారని ఐలయ్య అన్నారు. అదే అగ్రకుల దేవుళ్లకు సంస్కృతం తప్ప మరో భాష అర్థం కాదని అన్నారు. వాళ్ల దేవులంతా నున్నగా గడ్డాలు గీసుకుని కనిపిస్తుంటారని, మంగలి వాళ్లు షేవింగ్ చేయకపోతే అంత అందంగా వాళ్లు ఉండేవారా? అని ప్రశ్నించారు. మంగలి కత్తి నీతి తప్పలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+