వైఎస్ జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పరిపాలనను దూకుడుగా ముందుకు సాగించాలని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ప్రక్షాళనపై ఫోకస్ చేసిన ఆయన ఐఏఎస్ అధికారుల బదిలీ పైన సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత నేడు కొంతమంది కీలక అధికారులను బదిలీ చేశారు.

పదిరోజుల క్రితం బదిలీ చేసిన అధికారికి ప్రమోషన్
ఒకేసారి ఏకంగా 44మంది కీలక అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిహెచ్ఎంసి కమిషనర్ గా అమ్రపాలి కాటాకు కీలక బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి, లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి కూడా ప్రమోషన్ ఇచ్చారు. గత పదిరోజుల క్రితం బదిలీ చేసిన అధికారికి ప్రస్తుతం ప్రమోషన్ ఇవ్వడం, అది కూడా కీలక శాఖలో బాధ్యతలు అప్పగించటం అధికారిక వర్గాలలో చర్చనీయాంశమైంది.

Promotion for the official who demolished the buildings in front of Lotus Pond ys Jagan house

జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారి
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న షెడ్లను కూల్చివేశారు. ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పి కూల్చివేతకు పాల్పడ్డారు. దీంతో అధికారులకు తెలియజేయకుండా కూల్చివేసినందుకు చర్యలు తీసుకుంటూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై ఆమె సీరియస్ అయ్యి తీసుకున్న నిర్ణయంతో ఇది చర్చనీయాంశం అయ్యింది.

ఆయనపై చర్య తీసుకున్న ఆమ్రపాలి కాటా
ఆయనను జిఏడి కె అటాచ్ చేస్తూ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్ఎంసి నుంచి తక్షణమే ఆయనను రిలీవ్ చేశారు. సాధారణ పరిపాలన విభాగం ముందు రిపోర్టు చేయాలని ఆదేశించారు. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా తమకు తెలియకుండా జరిగిందని హేమంత్ ను పది రోజుల క్రితం బదిలీ చేశారు.

టీఎస్ఎంఎస్ఐడిసి ఎండిగా పోస్టింగ్
ప్రస్తుతం ఆయనకు టీఎస్ఎంఎస్ఐడిసి ఎండిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చిన అధికారికి ప్రమోషన్ వచ్చిందని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+