• search

వ్యభిచార రొంపిలోకి హాస్టల్ అమ్మాయిలు.. డబ్బు, స్మార్ట్‌ఫోన్లు, డ్రెస్‌లు, బంగారంతో ఎర!

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వరంగల్: గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే అమ్మాయిలపై వ్యభిచార ముఠాలు కన్నేస్తున్నాయి. నగరంలోని వివిధ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న నేపథ్యంలో ఆయా హాస్టళ్ల నిర్వాహకుల సహకారంతో వారిని ఉచ్చులోకి లాగుతున్నాయి.

  డబ్బు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, డ్రెస్‌లు, బంగారం నగలు ఎరవేస్తూ అమాయక యువతులను లొంగదీసుకుని వారితో వ్యభిచారం చేయిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై కాలేజీ అమ్మాయిలను తీసుకెళ్లి మర్నాడు తెల్లవారక ముందే హాస్టళ్లకు కొంత దూరంలో దింపి వెళుతున్నారు.

   గుట్టుచప్పుడు కాకుండా...

  గుట్టుచప్పుడు కాకుండా...

  వరంగల్‌ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఒకప్పుడు కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు నగరానికి పాకింది. కొందరు మహిళలు, పురుషులు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు. తమకున్న పలుకుబడితో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరంలోని పలు కాలనీల్లో పెద్ద పెద్ద భవంతులు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల వారికి ఏమాత్రం అనుమానం రాకుండా కథ నడిపిస్తున్నారు. పోలీసుల భయంతో పర్మినెంటుగా యువతులను ఉంచకుండా విటులు వచ్చాక.. యువతులను రప్పిస్తుండడంతో ఎవరికీ పెద్దగా అనుమానం రావడం లేదు.

   హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు వల...

  హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు వల...

  గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికి వచ్చి హాస్టళ్లలో ఉంటున్న అమ్మాయిలను ఈ వ్యభిచార ముఠాలు ట్రాప్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల సమీపంలో ఉన్న గర్ల్స్ హాస్టల్స్‌ వీరికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలకు డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్‌ ఫోన్లు ఆశ చూపిస్తూ ఈ రొంపిలోకి లాగుతున్నారు.

   MBA Graduate Arrested For Stealing Laptops And Mobile Phones From Hostel | Oneindia Telugu
    కాసేపు కళ్లమూసుకుంటే చాలు...

   కాసేపు కళ్లమూసుకుంటే చాలు...

   ముందుగానే కొంతమంది అమ్మాయిల కుటుంబ ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. కాసేపు కళ్లుమూసుకుంటే లగ్జరీ జీవితాన్ని గడపొచ్చంటూ లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులను తమ గుప్పిట్లో పెట్టుకుని, సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై కాలేజీ అమ్మాయిలను తీసుకెళ్లి మర్నాడు తెల్లవారక ముందే హాస్టళ్లకు కొంత దూరంలో దింపి వెళుతున్నారు. ఇలా ఈ వ్యభిచార ముఠాల బారిన పడి ఈ దందాలో పావులుగా మారిన అమ్మాయిలకు రోజుకు రూ.500, రూ.1000 ఇస్తున్నట్లు, ఈ చీకటి దందాపైన నిర్వాహకులు కూడా రోజుకు రూ. 2 వేల నుంచి 4 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

    వ్యభిచారానికి రహస్య స్థావరాలు...

   వ్యభిచారానికి రహస్య స్థావరాలు...

   వరంగల్‌ మహానగరంలో సుమారు వంద ప్రదేశాల్లో వ్యభిచారానికి రహస్య స్థావరాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు నగర సమీపంలోని కొన్ని గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్స్‌ వేదికగా చేసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ ఉండే ప్రదేశాల్లో లాడ్జీ లు, హైఫై హోటళ్లలో యథేచ్ఛగా వ్యభిచారం సాగుతోంది. హన్మకొండ బస్‌స్టేషన్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎంజీఎం జంక్షన్‌, కేయూ జంక్షన్‌, బట్టలబజార్‌, సుబేదారి, అడ్వకేట్స్‌ కాలనీ, వడ్డేపల్లి పల్లి, సహకారనగర్‌, కేయూ, హసన్‌పర్తి, మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్‌, కాజీపేట, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యభిచార గృహాలు నడుస్తున్నట్టు సమాచారం.

    సంపన్న కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని...

   సంపన్న కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని...

   నగరంలోని సంపన్నవర్గాలు ఉండే కాలనీలలో కొంతమంది మహిళలు ఇళ్లు కిరాయికి తీసుకుని వాటిలో ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తమ కుటుంబ యజమాని విదేశాల్లో ఉన్నారని నమ్మబలుకుతున్నారు. నెలకు రూ. 10 నుంచి 20 వేల వరకు అద్దె చెల్లిస్తుండడంతో ఇంటి యజమానులు కూడా తమకొస్తున్న అద్దెను చూసుకుంటూ తాము అద్దెకిచ్చిన భవనాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. నిర్వాహకులు కూడా తెలివిగా విటులకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో అమ్మాయిల ఫొటోలు పంపించి, నచ్చిన వారిని ఎంచుకున్నాక సమయానుగుణంగా అమ్మాయిలను పిలిపిస్తున్నారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండే అపార్ట్‌మెంట్లలోనే ఈ వ్యవహారం సాగిస్తుండడతో పోలీసులకు కూడా పెద్దగా అనుమానం రావడం లేదు.

    నిఘా వైఫల్యంలో టాస్క్‌ఫోర్స్...

   నిఘా వైఫల్యంలో టాస్క్‌ఫోర్స్...

   వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో వ్యభిచార గృహాలు యథేచ్ఛగా నడుస్తున్నా.. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరికట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలని పసిగట్టడంలో టాస్క్‌ఫోర్స్‌, పోలీసు నిఘావ్యవస్థలు వైఫల్యం చెందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం గుట్కాలు, బెల్టుషాపులలో మద్యం అమ్మకాలను నియంత్రించడాకే టాస్క్‌ఫోర్స్‌ పరిమిమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో చాలాచోట్ల ఇలాంటి చీకటి పనులు సాగుతున్నాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాలలో కింది స్థాయి పోలీసులు పట్టుకున్నా.. పోలీసు ఉన్నతాధికారులే విడిపిస్తున్నట్లు సమాచారం.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   In Warangal city.. Prostitution is going on. Some people are taking buildings for rent in posh areas and doing this business. Their target is the college girls who are economically backward and staying in girls hostels which are located in Warangal, Hanmakonda, Kazipet.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more