ఏది నిజం: ఊహించిన దానికన్నా.. ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పిన పూరీ?
సంచనలం రేపిన డ్రగ్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను బుధవారం సిట్ విచారించింది. తొలుత కెల్విన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన పూరీ.. ఆ తర్వాత అధికారులు ఆధారాలు చూపించడంతో బుక్ అయ్యారు.
హైదరాబాద్: సంచనలం రేపిన డ్రగ్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను బుధవారం సిట్ విచారించింది. తొలుత కెల్విన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన పూరీ.. ఆ తర్వాత అధికారులు ఆధారాలు చూపించడంతో బుక్ అయ్యారు.

చార్మీ బర్త్ డే.. కెల్విన్-పూరీ హాజరు
ముఖ్యంగా చార్మీ పుట్టిన రోజు సందర్భంగా పూరీతో పాటు కెల్విన్ కూడా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, కెల్విన్ మొబైల్‌లో పూరీ ఫోన్ నెంబర్, మరికొన్ని ఆధారాలను అధికారులు ముందు పెట్టారు.
Recommended Video


గుట్టు విప్పిన పూరీ
దీంతో పూరీ తనకు కెల్విన్ తెలుసునని, కానీ డ్రగ్స్ అలవాటు లేదని చెప్పాడని చెబుతున్నారు. విచారణలో పూరీ అంగీకరించాడని ప్రచారం సాగుతుండగా, విచారణ అనంతరం రాత్రి పూరీ మాత్రం మరోలా చెప్పారు.

విచారణ అనంతరం మరోలా..
కెల్విన్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతనిని ఎప్పుడూ కలవలేదని, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్తానని పూరీ ట్విట్టర్లో ఓ వీడియో పెట్టారు.

ఊహించిన దానికన్నా పెద్దదే.. వారికీ నోటీసులు
ఇదిలా ఉండగా, విచారణ సందర్భంగా పూరీ అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారని తెలుస్తోంది. దీని ప్రకారం డ్రగ్స్ రాకెట్ ఊహించినదాని కన్నా పెద్దదేనని అధికారులు భావిస్తున్నారు. మరో పది మంది సినీ ప్రముఖులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు పూరీ వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. వీరందరిపై నిఘా పెడుతున్న సిట్ బృందం.. వారికి కూడా నోటీసులు జారీ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది.

గోవా బీచ్, రేవ్ పార్టీలలో..
గోవా బీచ్‌లలో, రేవ్ పార్టీలలో విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటారని పూరీ వెల్లడించారని తెలుస్తోంది. రేవ్ పార్టీల్లో రాక్ మ్యూజిక్‌తో డాన్స్ ప్రోగ్రాంలు, డ్రగ్స్‌తో ఎంజాయ్ చేస్తారని చెప్పాడని సమాచారం. గోవాలో సెలబ్రిటీలు పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తుంటారని, ఆ సంస్కృతిని నగరానికి తీసుకొచ్చారని చెప్పారని సమాచారం.

ఇద్దరు ప్రముఖుల పేర్లు పూరీ చెప్పాడా?
రేవ్ పార్టీలు, మ్యూజిక్ డాన్స్ పార్టీలు నిర్వహించే ఇద్దరు ప్రముఖుల పేర్లు పూరీ జగన్నాథ్ వెల్లడించాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు గోవా బాబులను పట్టుకునేందుకు సిట్ చర్యలు తీసుకోనుంది. గోవా మాదిరిగా హైదరాబాద్‌లోని సీక్రెట్ స్థలాల్లో ప్రముఖులు పెద్దపెద్ద ఈవెంట్లు, పార్టీలు ఏర్పాటు చేస్తారని చెప్పిన నేపథ్యంలో వాటి గుట్టు రట్టుచేసేందుకు సన్నద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications