నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్'(ఫోటోలు)
హైదరాబాద్: ఖదీర్ అలీ బేగ్ ఫెస్టివల్‌లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో "సిమ్లా కాఫీ హౌస్" నాటకం వినోదాత్మకంగా సాగింది. కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ ఇతివృత్తంగా సాగిన సిమ్లా కాఫీ హౌస్ హిందీ నాటకం చక్కని సందేశాన్ని అందించింది.
రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న ఖాదిర్ అలీబేగ్ నాటకోత్సవాల్లో బుధవారం ఈ విశ్లేషణాత్మక నాటకాన్ని ముంబైకి చెందిన ఇప్టా వారు ప్రదర్శించారు. డబ్బుతో ముడిపడి ఉన్న విషయాలతో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న పొరపొచ్చలు, తగ్గుతున్న మానవ సంబంధాలు, డబ్బున్న పెద్దల మధ్య సంబంధాల నిజస్వరూపాన్ని ఎత్తిచూపుతూ సామాన్యమైన కాఫీ హౌస్ వెయిటర్ పాత్రతో కనువిప్పుగావించేలా ఈ నాటకం సాగింది.
రాకేష్ బేడీ నటనా దర్శకత్వలో నటీనటులు ఎస్.ఎమ్.జహీర్, ఆసిఫ్ షేక్ నివేదిత బౌంత్యాల్‌లు ఉత్తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రచయిత, అభిమానులకు మధ్య జరిగిన సంభాషణలు కడుపుబ్బ నవ్వించాయి. మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించి, ఆర్థిక సంబంధాల కారణంగా మసకబారుతున్న విలువలను ఈ నాటకంలో కళ్లకు కట్టారు. ఈ నాటకాన్ని తిలకించడానికి ప్రేక్షకులు ఎక్కువసంఖ్యలో వచ్చారు.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
ఖదీర్ అలీ బేగ్ ఫెస్టివల్‌లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో "సిమ్లా కాఫీ హౌస్" నాటకం వినోదాత్మకంగా సాగింది.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ ఇతివృత్తంగా సాగిన సిమ్లా కాఫీ హౌస్ హిందీ నాటకం చక్కని సందేశాన్ని అందించింది.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న ఖాదిర్ అలీబేగ్ నాటకోత్సవాల్లో బుధవారం ఈ విశ్లేషణాత్మక నాటకాన్ని ముంబైకి చెందిన ఇప్టా వారు ప్రదర్శించారు.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
డబ్బుతో ముడిపడి ఉన్న విషయాలతో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న పొరపొచ్చలు, తగ్గుతున్న మానవ సంబంధాలు, డబ్బున్న పెద్దల మధ్య సంబంధాల నిజస్వరూపాన్ని ఎత్తిచూపుతూ సామాన్యమైన కాఫీ హౌస్ వెయిటర్ పాత్రతో కనువిప్పుగావించేలా ఈ నాటకం సాగింది.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
రాకేష్ బేడీ నటనా దర్శకత్వలో నటీనటులు ఎస్.ఎమ్.జహీర్, ఆసిఫ్ షేక్ నివేదిత బౌంత్యాల్‌లు ఉత్తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

నవ్వుల పూయించిన 'సిమ్లా కాఫీ హౌస్' నాటకం
రచయిత, అభిమానులకు మధ్య జరిగిన సంభాషణలు కడుపుబ్బ నవ్వించాయి. మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించి, ఆర్థిక సంబంధాల కారణంగా మసకబారుతున్న విలువలను ఈ నాటకంలో కళ్లకు కట్టారు.












Click it and Unblock the Notifications