బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాడి: షాకింగ్ వీడియో వైరల్

హైదరాబాద్: ఓ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన 'గెలుపెవరిది' కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బీజేపీ నేతలు బీఆర్ఎస్ సర్కారుపై మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గూండాయిజానికి ఇది హాల్ మార్క్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన కుత్బుల్లాపూర్ అభ్యర్థిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థిపై బహిరంగంగా దాడి చేయడం, గొడవ చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇక, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలపై కూడా అదే విధంగా దాడి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వివేక్ పై పోలీసులు కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

quthbullapur mla vivekananda attacked on bjp mla candidate kuna srisailam goud on live tv

మాటల దాడి తర్వాత.. భౌతిక దాడి

ఎన్టీవీలో 'గెలుపెవరిది' కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత, కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ... 2009 నుంచి కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా అయిదేళ్ళపాటు చేశారని, కానీ ఆ తర్వాత ప్రజలు ఆయనకు డిపాజిట్ కూడా ఇవ్వలేదన్నారు. ఆయన పని చేస్తే ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు వివేక్.

ఈ క్రమంలో కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ... తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తిని అని, కనీసం ఓ పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచానని, కానీ వివేకానంద టీడీపీ నుంచి గెలిచి రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు భూకబ్జాదారు అని ఆరోపణలు చేసుకున్నారు.

ఈ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే వివేకానంద... తన స్థానం నుంచి ముందుకు వచ్చి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి యత్నించారు. శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్నారు. దీంతో తనపై దాడి చేసేందుకు యత్నించిన వివేకాను శ్రీశైలం గౌడ్ చేయి పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఛానల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి, వివేకానందను ఆపారు. ఛానల్ ప్రతినిధి మాట్లాడుతూ... వివేకానంద గారు ఇది కరెక్ట్ కాదు అంటూ ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శీశ్రైలం గౌడ్‌పై ఎమ్మెల్యే వివేక్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతయీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఎమ్మెల్యే వివేక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంతోనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలను నిర్ణయించుకున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+