'రాధికా.. అంత పిరికిది కాదు': ఆత్మహత్యపై కొనసాగుతున్న దర్యాప్తు

Recommended Video

    Radhika's Case : Police Interrogation

    హైదరాబాద్: ప్రముఖ న్యూస్ చానెల్ వీ6 యాంకర్ రాధికా(36) ఆత్మహత్యపై విచారణ కొనసాగుతోంది. ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆమె బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించారు.

    రాధిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు పోలీసులతో చెప్పారు. రాధిక సహోద్యోగులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. దీంతో రాధిక ఆత్మహత్యకు డిప్రెషనే కారణమా?.. లేక మరేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

    Radhika Reddy suicide case: Police begin probe, to scrutinise call records of Telugu TV news anchor

    రాధిక కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ కు ప్యాటర్న్ లాక్ ఉండటంతో సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. కాల్ డేటా అనాలిసిస్‌లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని భావిస్తున్నారు.

    తన వ్యక్తిగత సమస్యల గురించి ఆమె ఎవరితోనైనా మాట్లాడటం, లేదా మెసేజ్‌లు పంపించడం జరిగిందా? అన్న దానిపై ఆరా తీయనున్నారు.

    కాగా, ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే రాధిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య జర్నలిస్టు వర్గాలను తీవ్రంగా కలచివేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+