కేయూలో ర్యాగింగ్‌... 81 మంది విద్యార్థునుల స‌స్పెన్ష‌న్‌..

కేయూలో ర్యాగింగ్ తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలోని అమ్మాయిల వ‌స‌తి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది సీనియర్ విద్యార్ధినులను అధికారులు సస్పెండ్ చేశారు. క‌ళాశాల‌ల్లో ర్యాగింగ్‌లు జ‌ర‌గ‌డం స్వ‌ర‌సాధార‌ణం. అదికూడా ఎక్కువ‌గా అబ్బాయిలు చేస్తుంటారు. కానీ, కేయూలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఈ ర్యాగింగ్‌లో ఏకంగా 81 మంది అమ్మాయిల పేర్లు బ‌య‌టికొచ్చాయి. ఇంత‌మంది విద్యార్థినుల‌ను స‌స్సెండ్ చేయ‌డం కూడా ఇదే తొలిసార‌ట‌.

ప‌రిచ‌యాల పేరుతో జూనియ‌ర్ విద్యార్థుల‌పై సీనియ‌ర్స్ ర్యాగింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. గ‌త కొన్ని రోజులుగా ర్యాగింగ్ జ‌రుగుతుంద‌ని ఫిర్యాదులు వ‌స్తున్నాయి. అయితే, కేయూలో జరిగిన ఈ ర్యాగింగ్ డిసెంబ‌ర్ 20న అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విష‌యంపై స్పందించిన అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. బాధిత విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు 81 మంది విద్యార్థుల‌ను అధికారులు స‌స్పెండ్‌ చేశారు. పద్మావతి మహిళా వసతి గృహంలో ఈ ర్యాగింగ్ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

Ragging in KU... Suspension of 81 students..

వివిధ స‌బ్జెక్టుల‌కు చెందిన విద్యార్థులు : ర్యాగింగ్ చేయటంపై నిషేధం ఉన్నా కానీ, ఇదే ప‌ద్ధ‌తి యూనివ‌ర్సీటీలో కొన‌సాగుతోంది. కానీ కేయూలో మాత్రం బాధితులు దైర్యం చేసి అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నా విద్యార్థినిల వివరాలు సేకరించి వారిని స‌స్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన విద్యార్థునుల‌లో పీజీ చ‌దివే వారు 28 మంది, కామర్స్ విభాగానికి చెందిన‌వారు 28 మంది, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు కూడా ఇందులో ఉన్నారు.

ఈ 81 విద్యార్థినులను వారం రోజులు పాటు స‌స్పెండ్ చేశారు. వీరితో పాటు మిగతా విభాగాల్లోనూ ర్యాగింగ్‌కు పాల్పడిన వారి వివరాలను అధికారులు సేక‌రిస్తున్నారు. ఆధారాలు లభిస్తే ర్యాగింగ్‌ చేస్తున్న వారిని సస్పెండ్‌ చేస్తామని అధికారులు వివ‌రించారు. ఇక శనివారం నుంచి డిసెంబర్‌ 31 వరకు క్రిస్మస్‌ సెలవులు ప్రకటించిన యూనివ‌ర్సిటీ అధికారులు, త‌క్ష‌ణ‌మే విద్యార్థులు హాస్టల్స్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇక‌పై యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ పాల్ప‌డిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+