తెలంగాణ ఒకే కుటుంబం కోసం కాదు: కేసీఆర్, కేటీఆర్‌లకు రాహుల్ గాంధీ చురకలు

వరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ (Rahul gandhi).. పినపాక, నర్సంపేట బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదని.. ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్ర ఇచ్చామని రాహుల్ పేర్కొన్నారు. ఈసారి ప్రజా ప్రభుత్వం రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇప్పడు బీఆర్ఎస్ నేతలు నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్ లు అడుగుతున్నారు.. వారిద్దరూ నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవి కాదా అని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ చదవిని స్కూళ్లు, కాలేజీలు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినవేనని రాహుల్ చురకలంటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఐటీ కేపిటల్ చేసిందన్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగా.. ప్రజలకు తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపనిలోనూ ఆ పార్టీ నేతల అవినీతి కనిపిస్తోందని రాహుల్ ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందన్నారు. ప్రాముఖ్యత ఉన్న మంత్రి పదవులు అన్నీ సీఎం కేసీఆర్ దగ్గరే అంటిపెట్టుకుని ఉంచుకున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మూడు ఒక్కటేనని విమర్శించారు.

Rahul gandhi hits out at brs and bjp, mim in pinapaka, narsampet congress public meetings

కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారంటీలతోపాటు ఇస్తున్న ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచి తప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రైతులకు ప్రతి కుటుంబానికి ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+