కేసీఆర్ ని మించిపోయేలా.. సెంటిమెంట్ తో కొడుతున్న రాహుల్ గాంధీ!!
రాజకీయాల్లో ఓటర్లను ఆకట్టుకోవటంలో కేసీఆర్ దిట్ట. పదునైన మాటలు, సెంటిమెంట్ తో ప్రజలను ఆకట్టుకుని తన ఓటు బ్యాంకుగా మలచుకోవటంలో ఆయనను మించిన వారు ఎవరూ లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆయనను మించిపోయేలా సెంటిమెంట్ మాటలతో తెలంగాణా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్, మూడో మారు అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని, తెలంగాణ స్వరాష్ట్ర స్వపరిపాలన సెంటిమెంట్ తో ముందుకు వెళుతున్నారు.

ఇక కెసిఆర్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచింది. కాంగ్రెస్ పార్టీ తాజాగా విజయభేరి సభల పేరుతో ఎన్నికల సభలను నిర్వహిస్తూ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలను ప్రజల వద్దకు తీసుకువెళుతుంది. కెసిఆర్ బాటలోనే ప్రజల వద్దకు వెళుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో సెంటిమెంటుతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇవి దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు జరుగుతున్న ఎన్నికలు - రాహుల్ గాంధీ #RahlGandhi #KCR #BRS #Congress #BJP #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaAssemblyElections #Oneindiatelugu pic.twitter.com/cN3dWvOGaM
— oneindiatelugu (@oneindiatelugu) October 20, 2023
తనకు తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం మాత్రమే కాదని, కుటుంబంతో ఉన్న అనుబంధమని రాహుల్ గాంధీ సెంటిమెంట్ పండిస్తున్నారు. 2004లో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేశామని పేర్కొన్న ఆయన, ఆ నిర్ణయాన్ని సోనియాగాంధీ తీసుకున్నారని, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి రాష్ట్రాన్ని ఇచ్చామని, మరి మీరు రాష్ట్రాన్ని ఇచ్చినందుకు మాకు ఒక్క ఓటు ఇవ్వలేరా అంటూ సెంటిమెంట్ పండిస్తున్నారు.
తన తల్లి సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చిన నేపధ్యంలో తెలంగాణాతో తనకు ఉన్నది కుటుంబ అనుబంధం అని రాహుల్ గాంధీ సెంటిమెంట్ తో ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ ను మించి సెంటిమెంట్ ను పండిస్తున్నారని టాక్ వస్తుంది.












Click it and Unblock the Notifications