రైల్వే వ్యాగన్స్.. మేడిన్ తెలంగాణ
Railway Manufacturing Unit: తెలంగాణలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల వరంగల్ జిల్లా దశ దిశ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. తుదిదశకు చేరుకుంటోంది.
అదే- రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. 160 ఎకరాల విస్తీర్ణంలో ఖాజీపేట్ వద్ద నిర్మితమౌతోంది. దీని నిర్మాణ వ్యయం 716 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది.

2023 జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌గా ప్రతిపాదించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా బదలాయించింది.
దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో 68 శాతం మెయిన్ షాప్ అంటే వ్యాగన్ల తయారీ కోసం కేటాయించిన యూనిట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన వాటిల్లో పెయింట్ వర్క్‌షాప్- 57, స్టోర్ వార్డు- 92, పిట్ ట్రావెర్సెస్-57, టెస్ట్ షాప్- 45 శాతం మేర నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి.
Being developed over an area of 160 acres, the RMU will have distinct structures equipped with state-of-the-art facilities to manufacture over 2,400 wagons in a year.
— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025
𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐢𝐨𝐧 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
Main Shop: 68%
Paint Shop: 57%
Store Ward: 92%
Pit Traversers: 57%
Test Shop:… pic.twitter.com/w34uxOQo2i
మరో ఏడాది కాలంలో నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు ఇక్కడి నుంచే రైల్వే వ్యాగన్లు సరఫరా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోన్న నేపథ్యంలో- వీటి కొరత తీరుతుందని జీ కిషన్ రెడ్డి చెప్పారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications