పండుగ రద్దీ వేళ విశాఖకు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!

దసరా సందడి మొదలైంది. వరుస సెలవులతో ప్రయాణాల సంఖ్య పెరిగింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లలో ప్రయాణీకుల రద్దీ కనిపిస్తోంది. పలు మార్గాల్లో ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొన సాగుతోంది. ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల రద్దీ మేరకు రైల్వే శాఖ పలు మార్గాలకు స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటిస్తోంది. అందులో భాగంగా విశాఖకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వీటికి సంబంధించి రూట్.. షెడ్యూల్ ను వెల్లడించారు.

దసరా రద్దీ వేళ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. రెండు నెలల ముందే పండుగ రోజుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో, పలు మార్గాల్లో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఇక, రైళ్లల్లో ఉన్న వెయిటింగ్ లిస్టు వివరాలను ప్రయాణీకులకు తెలియ చేస్తున్నారు. పండుగ చివరి మూడు రోజుల్లో రాకపోకల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రకటించింది. ఇదే సమయంలో చర్లపల్లి నుంచి విశాఖకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. ఈ రైలు ఈ నెల 15న చర్లపల్లి నుంచి బయలు దేరనుంది. ఇక విశాఖపట్నం నుంచి చర్లపల్లి వెళ్లే రైలు ఈ నెల 16న బయల్దేరుతుంది. ఇదిలా ఉండగా 79వ వార్షిక నిరంకారీ సత్సంగం - 2026 సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్ - పానిపట్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

కూటమి కంచుకోటల్లో మేయర్ అభ్యర్దులను ఖరారు చేసిన జగన్..!!
కూటమి కంచుకోటల్లో మేయర్ అభ్యర్దులను ఖరారు చేసిన జగన్..!!
railways-announces-special-trains-for-visakha-from-cherlapalli-during-dusserah-rush-time-here-the-d

పండుగ రద్దీ వేళ రైల్వే శాఖ నిర్ణయాలు

ప్రయాణీకుల రద్దీ వేళ అధికారులు ప్రత్యేక రైలు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 07067 చర్లపల్లి - విశాఖపట్నం ఈ రైలు 15న రాత్రి 9గంటలకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.05గంటలకు విశాఖ చేరుకుంటుంది. కాగా.. రైలు నంబర్ 07068 విశాఖ పట్నం - చర్లపల్లి ఈ రైలు 16న మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు రెండు దిశలలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. కాగా.. ట్రైన్ నంబర్ 07635 నాందేడ్ - పానిపట్ రైలు ఈ నెల 21, 27 తేదీల్లో ఉదయం 7.40గంటలకు నాందేడ్​లో బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5.30గంటలకు పానిపట్ చేరుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+