Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్ష సందేశం పంపిన బంగాళాఖాతం.. ఈ జిల్లాల్లో భారీవర్షాలు!

ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. దీనివల్ల దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాతం ఏర్పడింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అనేక జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.

rain alert from Bay of Bengal Heavy rains in these districts of AP and Telangana

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రేపు కూడా జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు రేపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు.

ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లాలో నేడు వర్షాలు
శ్రీకాకుళం జిల్లాలో నేడు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని , ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+