Weather Report: తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు..!
ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈనెల15, 16, 17 తేదీల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ వర్షాలు వడగళ్లుగా వచ్చే ఛాన్స్ ఉందట.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణకు వర్షసూచన ఎక్కువున్నట్లు పేర్కొంది.

అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి రాష్టం మీదకు వీస్తున్నట్లు వివరించింది. కాగా గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి.












Click it and Unblock the Notifications