హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం: వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు..
హైదరాబాద్: బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి
ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయాన్నే వర్షం కురవడంతో.. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

మలక్‌పేట, కాచిగూడ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, తార్నాక, లాలాపేట, ఓయూ క్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, చర్లపల్లి, బేగంపేట, బోయిన్‌పల్లి, ప్యాట్నీ, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మోండా మార్కెట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!