వీడియోతో అడ్డంగా దొరికిపోయిన లావణ్య
గతంలో నటుడు రాజ్ తరుణ్‌తో తన సంబంధం గురించి లావణ్య మీడియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలోనే వీరిద్దరూ కలిసి ఉన్నారని లావణ్య వెల్లడించారు. దీనిపై రాజ్ తరుణ్ కూడా తన వాదనను వినిపించడంతో, ఈ వివాదం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇదే ప్రధాన వార్తగా నిలిచింది.
అయితే, కొంతకాలం తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. మొదట రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఆరోపించగా, ఆ తర్వాత తాను ఎలా నష్టపోయానో రాజ్ తరుణ్ కూడా వివరించాడు. మొత్తానికి, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వ్యవహారం ముగిసిందని అంతా భావించారు.

తాజాగా, లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో లావణ్యకు సంబంధించిన కొన్ని ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో లావణ్య ఒక ప్యాకెట్‌ను పుస్తకంలో పెడుతూ కనిపించగా, మరో ఆడియోలో కళ్లద్దాల బాక్స్‌లో పెట్టమని చెబుతున్నట్లు ఉంది. ఈ వీడియోలు, ఆడియోల ఆధారంగా లావణ్య డ్రగ్స్ దందా నిర్వహిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఆరోపణలు పాత వివాదాన్ని మళ్లీ రాజేసి, సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో కూడా లావణ్య డ్రగ్స్ కేసులో దొరికిపోయింది.












Click it and Unblock the Notifications