Mega Family: మెగా కంపౌండ్‍లోకి రానున్న బుజ్జయి.. ఆనందంలో అభిమానులు..!
మెగాస్టా చిరంజీవి కోడలు, రాం చరణ్ భార్య ఉపసానకు మంగళవారం రోజు డెలివరీ జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన సోమవారం సాయంత్ర జాయిన్ అయినట్లు సమాచారం. రేపు ఉదయం ఆమెకు వైద్యులు డెలివరీ చేసే అవకాశం ఉంది. మెగా కుటుంబంలోకి వారసుడు వస్తాడా.. లేక వారసురాలు వస్తుందా అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
రామ్ చరణ్-ఉపాసనకు పెళ్లి అయి పదేళ్లు అయినా పిల్లలు పుట్టలేదని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా బాధపడ్డారు. ఇదే విషయమై ఉపసాన క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తను ఇంత కాలం పిల్లలను ఎందుకు కనలేదో చెప్పారు. రామ్ చరణ్ తో పెళ్లి తర్వాత మేమిద్దరు జీవితంలో స్థరపడ్డాకే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నామని ఉపాసన తెలిపారు.

ఇదే విషయాన్ని మామయ్య, అత్తయ్యలకు చెప్పామని వివరించారు. ఈ నిర్ణయంపై వారు బాధపడ్డారని చెప్పారు. మామయ్య మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆయన్ను బాధపెట్టి తాము తప్పు చేశామని చెప్పిన ఉపాసన.. రేపో, ఎల్లుండో మెగా వారుసుడు/వారసురాలికి జన్మనివ్వబోతోంది.
ఈ సంవత్సరం మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఈ సంవత్సరమే రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. చెర్రీ, జూ. ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటుకు ఆస్కార్ లభించింది. ఇప్పుడు మెగా కుటుంబంలోకి వాసురాలు/వారసుడు రాబోతున్నారు. ఆస్కార్ తో పాటు చిరంజీవి ఇంటిలోకి మనవడు/మనవరాలు రాబోతోంది.












Click it and Unblock the Notifications