మార్కెట్లోకి టిస్సాట్ వాచ్: టైం బాగుందన్న హీరో రానా (ఫోటోలు)
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌కు చెందిన వాచ్ బ్రాండ్ టిస్సాట్ తన సరికొత్త నూతన శ్రేణికి చెందిన చెమిన్ డే టొరెల్లెస్ చేతి గడియారాలను మార్కెట్లోకి విడుదల చేసింది. కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లోని టిస్సాట్ బొటిక్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
వాచ్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం రానా మాట్లాడుతూ బాహుబలి సెన్సేషన్ హిట్ పూర్తి సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రపంచ వ్యా ప్తంగా గుర్తింపు లభించిన ఆ సినిమాలో నటించడం నా అదృష్టమని అన్నారు. బాహుబలిలో భల్లాలదేవగా రానా నటించిన సంగతి తెలిసిందే.
బాహుబలి రెండవ భాగం ఎప్పుడు విడుదల అవుతుందన్న ప్రశ్నకు రానా స్పందిస్తూ, మొదటి భాగానికే మూడేళ్లు పట్టిందని, ఇక రెండవ భాగానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చని అన్నాడు. రెండవ భాగంలో ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయిందని మిగతా షూటింగ్ పూర్తిచేసుకొని 2016లో విడుదల అవుతుందని తెలిపాడు.
రుద్రమదేవి చిత్రంలో తనది చిన్న పాత్ర అయినప్పటికీ ఆ చిత్రం కూడా అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పాడు. టిస్సాట్ వాచీలకు తాను పెద్ద వీరాభిమానినని పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన చెమిన్ డే టొరెల్లెస్ చేతి గడియారం వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక టిస్సాట్ ఇండియా బ్రాండ్ మేనేజర్ పునీత్ మాథుర్ మాట్లాడుతూ చెమిన్ డే టోరెల్లెస్ ప్రత్యేకత సంతరించుకున్న మోడల్‌తో పాటు చరిత్రకు దర్పణం పడుతుందని తెలిపారు.

రానా చేతుల మీదగా మార్కెట్లోకి టిస్సాట్ కొత్త వాచ్
స్విట్జర్లాండ్‌కు చెందిన వాచ్ బ్రాండ్ టిస్సాట్ తన సరికొత్త నూతన శ్రేణికి చెందిన చెమిన్ డే టొరెల్లెస్ చేతి గడియారాలను మార్కెట్లోకి విడుదల చేసింది.

రానా చేతుల మీదగా మార్కెట్లోకి టిస్సాట్ కొత్త వాచ్
కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లోని టిస్సాట్ బొటిక్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

రానా చేతుల మీదగా మార్కెట్లోకి టిస్సాట్ కొత్త వాచ్
కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లోని టిస్సాట్ బొటిక్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

రానా చేతుల మీదగా మార్కెట్లోకి టిస్సాట్ కొత్త వాచ్
ఇక టిస్సాట్ ఇండియా బ్రాండ్ మేనేజర్ పునీత్ మాథుర్ మాట్లాడుతూ చెమిన్ డే టోరెల్లెస్ ప్రత్యేకత సంతరించుకున్న మోడల్‌తో పాటు చరిత్రకు దర్పణం పడుతుందని తెలిపారు.

Click it and Unblock the Notifications