Viral Video: యువతికి చుక్కలు చూపించిన ర్యాపిడో రైడర్.. డ్రైవింగ్ చేస్తూనే ఆ పని..
ఆ యువతికి ఆరోగ్యం బాగాలేక స్కూటీ తీయలేదు. ర్యాపిడో బుక్ చేసుకుని ఆఫీస్ కు వెళ్దామని అనుకుంది. అలాగే ర్యాపిడో బుక్ చేసుకుంది. కానీ వచ్చింది ర్యాపిడో రైడర్ కాదు. అంతకుమించిన వాడు. ఆమెను ఎక్కించుకున్నాడు. అతడి రాష్ డ్రైవింగ్ కు ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చొంది. అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అంతేకాక డ్రైవింగ్ చేస్తునే ఫోన్ లలో మాట్లాడుతున్నాడు. యువతి చెప్పినా అస్సలు పట్టించుకోలేదు. ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ యువతిని భయాందోళనలకు గురిచేశాడు. అతగాడి ర్యాష్ డ్రైవింగ్ కు యువతి తెగ భయ పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
"నా rapido కష్టాలు ..! ఈరోజు కాస్త హెల్త్ బాగోలేక నా స్కూటీ ఇంట్లో పెట్టి , rapido book చేసుకున్నాను . నా కర్మకొద్దీ ఇతను వచ్చాడు , అతనికి హెల్మెట్ లేదు , care లేదు , rash driving, ఫోన్ మాట్లాడుతూ చూడండి ఎలా వెళ్తున్నాడో .. wrong Route లో వెళ్ళకండి , u turn చేస్కోండి అంటే కోపం తో ఇంకా speed గా వెళ్లాడు . మీరు ఎప్పుడైనా ఇలాంటి rapido service ని Face చేసారా ? " అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది ఆ యువతి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
నా rapido కష్టాలు ..! 🥲
— Janani ❤️ (@Nageshw95904390) September 13, 2025
ఈరోజు కాస్త హెల్త్ బాగోలేక నా స్కూటీ ఇంట్లో పెట్టి , rapido book చేసుకున్నాను . నా కర్మకొద్దీ ఇతను వచ్చాడు , అతనికి హెల్మెట్ లేదు , care లేదు , rash driving, ఫోన్ మాట్లాడుతూ చూడండి ఎలా వెళ్తున్నాడో .. wrong Route లో వెళ్ళకండి , u turn చేస్కోండి అంటే… pic.twitter.com/FZGTUkUeSX
దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. బైక్ లే కాదు కార్లు ఆటో సర్వీసులు కూడా ఇదే దుస్థితి. ఈ సర్వీస్ సెంటర్లు మనం రేటింగ్ ఇచ్చే సమయంలో వాళ్ళ బిహేవియర్ పై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు. కానీ చర్యలు మాత్రం తీసుకోరు. పోలీసులు కూడా అయ్యో పాపం అని వీళ్లను వదిలేయడం కూడా ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారణం. అని ఒకరు కామెంట్ చేశారు.
అవును .. వీడియో తీసి మంచి పని చేసారు .. ఇలాంటి వెధవల వల్ల ర్యాపిడోలో బైక్ డ్రైవ్ చేసుకుని బతికే ఎంతోమందికి చెడ్డ పేరు వస్తుంది .. ఒక్క ర్యాపిడో మాత్రమే కాదు ఓలా , ఊబర్ లలో క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకున్నా సరే ఇలాంటి వాళ్లే ఉంటున్నారు ..నోట్లో గుట్కా నములుతూ కస్టమర్ తో సరిగా మాట్లాడారు కూడా .. పైగా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్.. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకో విషయం మీ మాదిరి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి వారి వల్ల ప్రమాదం కూడా ... ఈ వీడియోని మీరు ర్యాపిడో కస్టమర్ కు ట్యాగ్ చేయండి .. వీలైతే సీఈవో కి అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి వాడు నాకూ ఒకడు తగిలాడు.. ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ, రెండో చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు. సెంటర్ లో ఒకడిని ఆల్మోస్ట్ గుద్దుకోబోపోతే, ఏం బాబు పడేస్తావా అన్నందుకు.. నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఈ వెధవతో మనకేం పంచాయతీ అని.. వెంటనే రైడ్ ఆపి, బైక్ దిగేసి.. కంప్లైంట్ పెట్టా.. అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications