Ration Card: ఇంకా ఆ పని చేయలేదా.. గురువారమే లాస్ట్.. లేకుంటే మీ రేషన్ కార్డు కట్..!
రేషన్ కార్డు ఉన్న వారు అందరు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్ కార్డు ఈ కేవైసీ గడువును చాలాసార్లు పొడగించారు. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 తుది గడువుగా విధించారు. ఇప్పటికీ రేషన్ కార్డు కేవైసీ చేసుకోకుంటే.. చేసుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఈ రెండు రోజుల్లో రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలని.. లేకుంటే రేషన్ కార్డు కట్ అవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ ఐదు నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్రం ఇప్పటి వరకు 75 శాతం మంది రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునున్నారు. ఇంకా 25 శాతం మంది రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలి. వారు ఈ రెండు రోజుల్లోనే చేసుకోవాలి. లేకుంటే వారి రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది. బోగస్ రేషన్ కార్డులు తొలగించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డు ఈ కేవైసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలి.

ఈ కేవైసీ కోసం దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లాలి. మీ రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్ చెప్పాలి. అప్పుడు బయోమెట్రిక్ మిషన్ మన ఆధార్, రేషన్ కార్డు నంబర్ ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత మనం బయెమెట్రిక్ ఇవ్వాలి. అంటే చేతి గుర్తులు ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకున్న వారి పేరు ఉంచి.. మిగతా వారి పేర్లను తొలగించనున్నారు.
అయితే తెలంగాణలో చాలా మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. వారు ఇండియాకు వచ్చి ఈకేవైసీ చేసుకోవాలంటే సమయం పడుతుంది. వారి కోసం రేషన్ కార్డు ఈకేవైసీ గడుపు పెంచాలని కోరుతున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయితే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి.












Click it and Unblock the Notifications