వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ధరణి స్కానర్లు : సప్లిమెంటరీ కన్నా ముందే రిజల్ట్స్ అన్న అశోక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ధరణి స్కానర్లు || Oneindia Telugu

హైదరాబాద్ : ఇంటర్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ పక్కా ప్రణాళికతో రూపొందిస్తామని చెప్పారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్. సప్లిమెంటర్ ఫలితాల కన్నా ముందే రీ కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ వెల్లడిస్తామని స్పష్టంచేశారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.

ధరణి స్కానర్ల వినియోగం

ధరణి స్కానర్ల వినియోగం

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ధరణి ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్న స్కానర్లను వినియోగిస్తామని ప్రకటించారు. మొత్తం 12 కేంద్రాల్లో రీ కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా ఏ చిన్న లోపం రాకుండా జాగ్రత్తగా ఈ ప్రక్రియను చేపడుతామని ఉద్ఘాటించారు.

ప్రతిరోజు బులెటిన్

ప్రతిరోజు బులెటిన్

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు సంబంధించి ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తామని అశోక్ తెలిపారు. మొత్తం 12 కేంద్రాల్లో ప్రక్రియను ఆయా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఒక్కో కేంద్రంలో దాదాపు 70 వేల నుంచి లక్షన్నర వరకు జవాబు పత్రాలను రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేస్తామని వెల్లడించారు.

 దిద్దుబాటు చర్యలు

దిద్దుబాటు చర్యలు

ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై కమిటీ 10 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పిచింది. ఈ నేపథ్యంలో రీ కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. మరోవైపు ఫలితాల్లో అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చి కమిటీ వేసి .. తదుపరి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Inter re-counting and re-verification will be set says Inter-Board Secretary Ashok Kumar. The results of re-counting were revealed before the supplimentary results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X