సరేనన్నాడు, ఇంతలో అంతా అయిపోయింది: శ్రీనివాస్ కూచిభొట్ల భార్య కన్నీరుమున్నీరు
ఆ రోజు రాత్రి ఏడున్నర గంటలకే ఇంటికి వస్తానని చెప్పాడని శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన అన్నారు. ఆమె బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఆ రోజు ఆస్టిన్ బార్(కాన్స్‌స)లో కాల్పులు జరిగిన విషయం నాకు తెలిసింది గానీ చనిపోయింది తన భర్తేనన్న విషయం తెలియలేదని శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.
భర్త మరణంతో తన లోకం ఒక్కసారిగా చీకటైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22 ఉదయం ఆఫీసుకు వెళ్తూ తన భర్త తనకు బై చెప్పాడని, ఆయన్ను ప్రాణాలతో చూడ్డం అదే ఆఖరుసారి అని సునయన కంటతడిపెట్టారు. అప్పటికి రెండు రోజులుగా రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని ఆమె చెప్పారు.
దాంతో 'ఈ రోజు వర్క్ ఏదైనా ఉంటే ఇంటికి తెచ్చుకో. ఇద్దరం కలిసి కాసేపు టీ తాగుతూ మాట్లాడుకుందాం' అని తాను మెసేజ్ పెట్టానని, సరేనంటూ శ్రీనివాస్ తన మెసేజ్‌కు సానుకూలంగా స్పందించాడని సునయన చెప్పారు.

ఏడింటికల్లా ఇంట్లో ఉంటానన్నాడు...
రాత్రి 7 గంటలకల్లా ఇంట్లో ఉంటానని చెప్పాడని, 8 గంటలైనా రాకపోవడంతో తాను ఆందోళన చెందానని సునయన అన్నారు. అలోక్ భార్యకు ఇతర స్నేహితులకు కూడా ఫోన్ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత తాను భోజనం చేస్తూ అలవాటుగా ఫేస్‌బుక్ చూస్తున్నానని, అందులో ఒక వీడియో.. కాల్పులు జరిగాయని ఉందని చెప్పారు. ‘

ఎక్కడో ఏదో జరిగిందని అనుకున్నారు..
మళ్లీ ఎక్కడో ఏదో జరిగినట్లుందని, ఎవరో గాయపడి ఉంటారని అనుకున్నానని, ఇంతలోనే ఆస్టిన్స్ పేరు కనిపించిందని,. కాల్పుల బాధితులను యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని అందులో చదివి వెంటనే బయల్దేరానని, గ్యారేజ్ దాకా వెళ్లి అక్కడే కుప్పకూలిపోయానని, తర్వాత మా ఇంటికి ఇద్దరు పోలీసులు వచ్చారని సునయన చెప్పారు.

నా పేరు, శ్రీని పేరు అడిగారు..
తన పేరు, శ్రీని పేరు అడిగారని, ఆయన పుట్టినరోజు అడిగారని సునయన చెబుతూ ఆ తర్వాత వాళ్లు ‘వియ్ ఆర్ సారీ' అని చెప్పారని చెప్పారు. తర్వాత తాను ఆందోళనతో చేరుకున్నానని, సెక్యూరిటీ వాళ్లు తనిఖీల కోసం ఆపారని, తన భర్త చనిపోయారని చెప్పినా లోపలికి పంపలేదని సునయన చెప్పారు.

ఇటీవలే తండ్రికి కారు కొనిచ్చారు..
శ్రీనివాస్ ఇటీవలే తన తండ్రికి ఒక కారు కొనిచ్చారని, కొడుకు ఇచ్చిన ఆ బహుమతి చూసి తన మామ ఆనందించారని సునయన చెప్పారు.నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఎంతగానో భయపడ్డానని.. భయంతో సరిగా నిద్ర కూడా పోయేదాన్ని కానని చెప్పారు. తన భర్త అమెరికాను ఎంతగానో ప్రేమించేవాడని సునయన చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications