హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లేడీ టెక్కీ ఆత్మహత్య: రీనా ప్రాధేయపడినా, తిట్టారు.. కొట్టారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన కుమార్తె రీనా సిల్వియా మృతికి కారణమైన డేంజిల్ సింగమ్ కుటుంబ సభ్యులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని ఆమె తల్లి మేరీ జాన్, తండ్రి రిచర్డ్ సన్ డిమాండ్ చేశారు. తన కుమార్తె సూసైడ్ నోట్లో తన మృతికి ప్రియుడు డేంజిల్ సింగమ్, అతడి తండ్రి బిషప్ విల్సన్ కుమార్ సింగమ్, తల్లి సునీత, సోదరి దానియాల పేర్లు పేర్కొన్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

వారు శనివారం ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. డేంజిల్ మాత్రమే పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని, మిగతా వారిని అరెస్టు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుమార్తె రీనా డిగ్రీ చదువుతున్నప్పుడే బోడుప్పల్‌కు చెందిన డేంజిల్‌తో పరిచయడం ఏర్పడిందన్నారు.

హైదరాబాద్ లేడీ టెక్కీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్హైదరాబాద్ లేడీ టెక్కీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

ఆ పరిచయం ప్రేమగా మారి, ఐదేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్నారు. తన కుమార్తె ఓ సాఫ్టువేర్ కంపెనీ సంస్థలో పని చేస్తుండగా, అప్పటి వరకు ఖాలీగా ఉన్న డేంజిల్‌కు తాను పని చేస్తున్న సంస్థలోనే ఉద్యోగం ఇప్పించిందన్నారు.

Reena Parents demand for Denzil family arrest

గత నెల 27న ఈస్టర్ సందర్భంగా డేంజిల్ మౌలాలీలోని తమ ఇంటికి వచ్చి రీనాను తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పాడని, ఆ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో డేంజిల్ తమ కూతురుకు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో తన కూతురు బోడుప్పల్‌లోని డేంజిల్ ఇంటికి బయలుదేరిందన్నారు.

అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదన్నారు. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో సెల్ ఫోన్‌కు ఫోన్ చేయగా సమాధానం రాలేదన్నారు. అదే రోజు రాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తమకు ఓ కానిస్టేబుల్ ఫోన్లో ద్వారా.. రీనా పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పాడని, రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో అక్కడకు వెళ్లామని చెప్పారు.

ఏం జరిగిందని కూతురిని అడిగామని, డేంజిల్ తల్లి, తండ్రి, సోదరి తనను దుర్భాషాలాడారని, కొట్టారని చెప్పిందన్నారు. తాను, డేంజిల్ కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపిందన్నారు. డేంజిల్‌ను తన కూతురు బతిమాలినా కూడా తనను మరచిపోవాలని చెప్పాడని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు.

ఆ తర్వాత ఉదయం తాము చూసేసరికి మృతి చెంది ఉందన్నారు. సూసైడ్ నోట్లో డేంజిల్ కుటుంబ సభ్యులను ఆమె తప్పుబట్టిందన్నారు. పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు.

కాగా, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్టువేర్ ఇంజినీర్ రీనా ఆత్మహత్య కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రీనాను ప్రేమించిన డేంజిల్ ఆ తర్వాత నాలుగు రోజులకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. డేంజిల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని రీనా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Techie Rina Parents demand for Denzil family arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X