అక్కడ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్: సీపీ సజ్జనార్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేస్తారు నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్నందున రేపు సాయంత్రం తో ఉప ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడుతుంది.

స్కూల్స్, కాలేజీలు సెలవు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 11న జరగనున్న క్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Restrictions in jubilee hills from november 9th evening Liquor shops closure too CP Sajjanar

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రేపు సాయంత్రం నుండి ఆంక్షలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆంక్షలు అమలులో ఉంటాయని సిపి సజ్జనార్ వెల్లడించారు.

మద్యం దుకాణాల మూసివేత
రేపు సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసేంత వరకు నియోజవర్గం పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు. ఓట్ల లెక్కింపు నాడు 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6గంటల వరకు మద్యందుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయాలలో మద్యం దుకాణాల తో పాటు, హోటళ్లు రెస్టారెంట్లు, క్లబ్బులు కూడా మూసివేయాలని సజ్జనార్ పేర్కొన్నారు.

అక్కడ 144 సెక్షన్.. అలా చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్
శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమి కూటమి నిషేధం అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాలలో బాణాసంచా కాల్చడం నిషేధం అని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+