రేవంత్‌రెడ్డి చిచ్చు: చంద్రబాబు ట్విస్ట్, మోత్కుపల్లికి షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

టిడిపిలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో టిడిపి తెలంగాణ ముఖ్యనాయకులతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేక్‌వ్యూ అతిథిగృహంలో శుక్రవారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ క్లైమాక్స్ చేరుకొందని భావిస్తున్నారు.

  Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

  టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టిడిపి నేతలతో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి‌ వ్యవహరం తేలనుంది.

  *ఎన్నికల సమయంలోనే పొత్తులపైన చర్చ

  * పార్టీ బలోపేతం చేసేందుకు పనిచేయాలని నేతలకు బాబు సూచన

  *పొత్తులపై ఎవరు కూడ మాట్లాడకూడదని బాబు ఆదేశం

  * కొందరు నేతలు రేవంత్‌కు మద్దతు

  *రేవంత్‌ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నం చేసిన కొందరు నేతలు

  *రేవంత్‌పై పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నివేదికలో దక్కని చోటు

  *పార్టీ నాయకులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చిన రమణ

  *పరస్పరం ఫిర్యాదు చేసుకొన్న రమణ, రేవంత్‌రెడ్డి

  *అక్టోబర్ 8వ,తేది తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలపై చంద్రబాబుకు వివరించిన రమణ

  *పార్టీ నేతల సమావేశంలో నోరు విప్పని రేవంత్‌రెడ్డి

  *పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని చంద్రబాబు వ్యాఖ్య

  *మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నిలువరించిన చంద్రబాబు

  * రేవంత్ విషయాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్

  *రేపు ఉదయం 10 గంటలకు చంద్రబాబుతో సమావేశం కానున్న రేవంత్‌రెడ్డి, టిడిపి నేతలు

  *అమరావతికి వెళ్ళే ముందు మరోసారి సమావేశం కావాలని బాబు సూచన

  *తనపై పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలను బాబుకు వివరించిన రేవంత్
  బాబుతో రేవంత్‌రెడ్డి ఏకంతంగా సమావేశం

  *చంద్రబాబుతో ముగిసిన టిడిపి ముఖ్య నేతల భేటీ

  * కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలపై చంద్రబాబుకు వివరణ ఇవ్వనున్న రేవంత్‌రెడ్డి
  *బాబుతో టిడిపి నేతల సమావేశానికి హజరైన రేవంత్‌రెడ్డి

  *రేవంత్‌రెడ్డికి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్

  *చంద్రబాబుతో సమావేశానికి హజరుకానున్నట్టు ప్రకటించిన రేవంత్‌రెడ్డి

  *తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పైనే ప్రధానంగా చర్చించనున్న చంద్రబాబునాయుడు

  *చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి అంశాన్ని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమణ

  వివరించారు.

  *సమావేశానికి హజరైన రమణ, సీతక్క, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహ్ములు, గరికపాటి, కృష్ణయ్య హజరయ్యారు.

  *చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టిడిపి తెలంగాణ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం

  Revanth episode: TTDP leaders meeting with Chandrababu at Lakeview guest house

  టిడిపి నేతలతో సమావేశానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించారు. ఇటీవల నరసింహన్‌ తల్లి మరణించారు. దీంతో నరసింహన్‌ను చంద్రబాబునాయుడు పరామర్శించారు.

  లేక్‌హ్యూ గెస్ట్‌హౌజ్‌కు చేరుకొన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
  లేక్‌హ్యూ అతిథిగృహనికి చేరుకొన్న టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ
  సమావేశానికి హజరుకావాలని రేవంత్‌రెడ్డి ఫోన్ చేసిన పార్టీ నేతలు.
  అసెంబ్లీలోనే ఉన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP chief Chandrababu naidu meeting with TTDP leaders on Friday at Lakeview guesthouse. Chandrababunaidu discussing on Revanth Reddy issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి