కుర్చీతోపాటు కేసీఆర్ అదృష్టాన్ని కూడా లాక్కున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గం కూడా కొలువు దీరింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన మేనిఫెస్టోకన్నా రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారంటీలకే ప్రజలు మొగ్గుచూపారు. మూడోసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో కేసీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించారు. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ కుర్చీతోపాటు ఆయన అదృష్టాన్ని కూడా రేవంత్ రెడ్డి లాక్కున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కేసీఆర్ లక్కీ నెంబరు 6. ఆయన దాన్ని తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. తాను చేసే ప్రతి పనిలోను ఆరు ఉండేలా చూసుకుంటారు. అయితే ఈసారి కేసీఆర్ 6 సంఖ్యను కాకుండా ముహూర్తాలను, నక్షత్రాలను, శుభ ఘడియలను నమ్ముకున్నారు. కాకపోతే ఇవేవీ ఆయనకు కలిసి రాలేదు. అధికారాన్నివ్వలేదు. తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కూడా నిర్వహించారు. ఇవేవీ ఆయన్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయలేకపోయాయి.

Revanth Reddy grabbed KCRs fortune along with the chair

రేవంత్ రెడ్డి అదృష్ట సంఖ్య 9. చిత్రం ఏమిటంటే కేసీఆర్ లక్కీ నెంబరుగా భావించే నవంబరు ఆరోతేదీన మధ్యాహ్నం 1.45 గంటలకు నామినేషన్ వేశారు. వాస్తు సిద్ధాంతం ప్రకారం ఆరోజు ఆయనకు క్షేమతార బలం ఉంది. కేసీఆర్ తారాబలం ప్రకారం 9వ తేదీన రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. దీనికోసం పలువురు వాస్తు సిద్ధాంతులను సంప్రదించారు. చివరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 6,9 మాత్రమే కాకుండా 8వ నెంబరుతో కూడా తెలంగాణ రాజకీయాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (జులై), రేవంత్ రెడ్డి ( నవంబరు) ఇద్దరి పుట్టినరోజు ఎనిమిదో తేదీనే. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17. ఈ రెండిటిని కూడితే 8 వస్తుంది. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీనే కాకుండా.. కేసీఆర్ అదృష్టాన్ని కూడా లాక్కున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+